మెదక్

నిరుద్యోగ యువత శిక్షణ తరగతులను సద్వినియోగపర్చుకోవాలి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మార్చి 6: నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, ఉపాధి తరగతులను సద్వినియోగపర్చుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని ఉర్దూ అకాడమిలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, క్యాప్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెండు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఒకటి శిక్షణ ఇచ్చి సరిఫికేట్ జారీ చేయడం, రెండవది శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. సంగారెడ్డిలోని జహీరాబాద్, న్యాల్‌కల్, కోహీర్ మండలాలకు చెందిన యువతకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జీవితంలో స్థిరపడాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాకుండా దానిని చేరుకునేందుకు నిరంతర కృషి అవసరమన్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం క్యాప్ పౌండేషన్ వారు ఉద్యోగాల నిమిత్తం ఇతర దేశాలకు పంపిస్తారన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి విక్రంరెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల పాటు ఎలక్ట్రిషియన్ కోర్సులో యువతకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ అనంతరం వీసా ప్రాసెసింగ్ చేసి ఇతర దేశాలలో ఉపాధి కల్పిస్తామని ఈ అవకాశాన్ని మైనార్టీ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో క్యాప్ పౌండేషన్ ప్రతినిధి మాధురి, శిక్షణకు హాజరైన యువత పాల్గొన్నారు.

రూ.50 లక్షలతో
ఈద్గా అభివృద్ధి పనులు

పటన్‌చెరు, మార్చి 6: సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో పట్టణ శివారులోని ఈద్గాలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. పర్వదినాలలో మైనారిటి సోదరులు ప్రార్థనలు జరుపుకోవడానికి తగిన వసతులు కల్పించాలని గ్రేటర్ హైద్రాబాద్ మహానగర మున్సిపల్ కార్పోరేషన్ తరపున ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈద్గాలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ ఇఇ శివానంద్, ఏఇ సుజాతలతో కలిసి సోమవారం పర్యవేక్షించారు. అనంతరము మాట్లాడుతూ పూర్తి నాణ్యతతో కూడిన పనులు జరగాలని అన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించడంలో సదరు కాంట్రాక్టరు ఏమాత్రం రాజీ పడకుండా జిహెచ్‌ఎంసి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల నుండి ముస్లిం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న టిఆన్‌ఎస్ ప్రభుత్వం ఈద్గాలు, మసీదుల అభివృద్ధికి గతంలో ఎన్నడు లేనంతగా నిధులు కేటాయిస్తోందన్నారు. పటన్‌చెరు నియోజకవర్గంలో మసీదుల ప్రహరీల పుననిర్మాణం దాదాపుగా పూర్తయిందన్నారు. లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రహరీల నిర్మాణంలో ముస్లింల ప్రార్థనా మందిరాలు కళకళలాడుతున్నాయని ఆనందం వెలుబుచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో మైనారిటి నాయకులు లియాకత్‌అలి, అజ్మత్,శౌకత్, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు ముగ్ధం అహ్మద్, హేక్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.