మెదక్

గంగదేవిపల్లి బాటలో గజ్వేల్ సెగ్మెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 6: ఇష్టపడి ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల ఆశలను నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సరికొత్త పంథాలో ముందుకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకే పరిమితమయ్యారనే అపవాదును తొలగించుకుని నియోజకవర్గ ప్రజల్లో నమ్మకం కల్పించుకునేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు నియోజకవర్గం పరిధిలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్‌లోని జనహిత భవన్‌లో సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా సమావేశమై సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించి దిశా నిర్దేశం చేసారు. మారుమూల గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అధికారులు లక్ష్యంతో ముందుకు వెళ్లేలా ప్రోత్సహించడం విశేషం. గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుని ఆ గ్రామ ప్రజలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పొందేందుకు గ్రామంలో పర్యటించాలని సూచించడం విశేషం. గ్రామాల్లో సమస్యలను తొలగించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేస్తానని, వాటిని ప్రజలు సద్వినియోగపర్చుకునేలా చైతన్యం తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నించాలని సూచించడం గమనార్హం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆయా గ్రామాల్లో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. గ్రామాల వారిగా కొత్తగా అభివృద్ధి కమిటీలు వేసి శాఖల వారిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అధికారులంతా కార్యోన్ముఖులు కానున్నారు. ప్రధానంగా బహిరంగ మల విసర్జన లేకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించేందుకు కృషి చేయడమే కాకుండా వాటిని సద్వినియోగపర్చుకునేలా ప్రజల్లో అవగాహన పెంపొందించనున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటిని అందించనున్నారు. మిషన్ భగీరథ తాగునీటి పథకాన్ని గజ్వేల్ మండలంలోని కోమటిబండ వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడి చేతుల మీదుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన రెండవ రోజు గజ్వేల్ నియోజకవర్గంలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రగతిపై దృష్టి సారించారు. ప్రతి గ్రామానికి బిటి రోడ్డు వేయించాలని, కరెంటు సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీటిని అందించేందుకు పనులు పూర్తికావచ్చాయి. కొన్ని గ్రామాల్లో ఈ నీటి పథకం అమలులో ఉంది. నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను నాలుగు రోజుల క్రితం సిఎం కెసిఆర్ స్వయంగా వచ్చి పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బస్టాండ్‌ను ఆధునీకరించడంతో పాటు ఎడ్యుకేషన్ హబ్, కూరగాయలు, మాంసం విక్రయ శాలల నిర్మాణం పనులను స్వతహగా పరిశీలించి వెళ్లారు. రింగ్ రోడ్డు నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించడం గమనార్హం. అధికార టిఆర్‌ఎస్‌పై తిరుగుబాటు బాహుటా ఎగురవేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జన ఆవేదన సదస్సులను నిర్వహిస్తున్న నేపథ్యంలో మొత్తం నియోజకవర్గం అభివృద్ధి సిఎం ఒక్కసారిగా దృష్టి సారించడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు దూసుకువెళ్లడం ఖాయమని చెప్పవచ్చు. నిధులు మంజూరు చేసే బాధ్యత నాది, వాటిని వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం మీ పూచీ అంటూ అధికారులకు బాధ్యతలు అప్పగించడం విశేషం. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా సమాఖ్య భవనాలు, పాఠశాలల భవనాలు, ప్రహరీగోడలు, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, మురికి కాలువలు తదితర అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగడం తథ్యం. రెండు గ్రామాల అభివృద్ధికే ప్రాధాన్యతను ఇచ్చిన సిఎం కెసిఆర్ మొత్తం నియోజకవర్గం అభివృద్ధిపై ఒకేసారి దృష్టి సారించడంతో ప్రజాప్రతినిధుల్లో ఊపిరిపోసినట్లైంది. ప్రధానంగా సర్పంచులకు చేతినిండా పనులు రానుండటంతో ప్రజలకు జవాబు చెప్పుకోగలమన్న ధీమా వ్యక్తమవుతోంది. ఆయా మండలాలకు చెందిన అధికారులంతా గ్రామాల వారిగా బాధ్యతలు తీసుకుని ముందుగ గ్రామ కమిటీలను విస్తరించిన అనంతరం కమిటీల నిర్ణయం మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి ప్రతిపాధనలు సిద్ధం చేసి నిధుల కొరకు ప్రభుత్వానికి పంపించనున్నారు. మొత్తంమీద గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో ఏకకాలంలో ప్రారంభం కానుండటం శుభసూచకమని చెప్పవచ్చు.