మెదక్

కాకతీయపై ప్రేమ..కరువుపై కాఠిణ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, ఏప్రిల్ 7: రెండేళ్లుగా కరువు రక్కసిలో చిక్కి రాష్ట్ర ప్రజల జీవితాలు చిన్నాభిన్నమైనా అధికార టిఆర్‌ఎస్ పార్టీ కనీసం స్పందించడం లేదని, నాయకులు, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మిషన్ కాకతీయ పనులపై ప్రేమను ఒలకబోస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మండల పరిధిలోని ఏటిగడ్డసంగం, మాలపాడు గ్రామాల్లో జిల్లా సిపిఎం బృందంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మమేకమై కరువు గురించి, ఎదుర్కొంటున్న సమస్యలపై వాకబు చేసారు. అనంతరం సింగూర్ ప్రాజెక్టుకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఆత్మకూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వీరభద్రం మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనుల వల్ల సామాన్య ప్రజలకు, కరువు కోరల్లో చిక్కిన వారికి ఏ మాత్రం ప్రయోజనం లేదన్నారు. పనులన్నింటిని యంత్రాల ద్వారా నిర్వహిస్తుండటంతో ప్రజలకు కనీసం ఉపాధి కూడా లభించకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. కాంట్రాక్టర్లు బాగుపడుతున్నారని విమర్శించారు. మూడున్నర దశాబ్దాల సింగూర్ చరిత్రలో ప్రాజెక్టు ఎన్నడు ఎండిపోలేదని, ఇప్పుడు ఎండిపోయిందంటే కరువు తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఉపాధి కూలీలకు ఐదు వారాలుగా డబ్బులు చెల్లించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఉపాధి హామి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో 36 వేల కోట్లు కేటాయించినా విడుదల చేసింది మాత్రం 3 వేల కోట్లేనన్నారు. ఈ విషయంలో తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు లెక్కలు తేల్చాలంటూ కేంద్రాన్ని మందలించిందన్నారు. నెట్టెంపాడు. కల్వకుర్తి, కోయిల్‌సాగర్ పనుల్లో విపరీతమైన జాప్యం కొనసాగుతుందని, పనులను వెంటనే పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటు వ్యక్తులు బోర్లలోని నీటిని కొల్లగొట్టి హైదరాబాద్‌లోని అపార్టుమెంట్లకు నీటిని అమ్ముకుంటున్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని తూర్పారబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి దందాను నిలువరించి అదే నీటిని ప్రజలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పశువులకు గ్రాసం, నీరు లేకపోవడంతో కబేళాలకు విక్రయిస్తూ రైతులు నట్టేట మునుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. గురువారం నాడు ఏటిగడ్డసంగం, మాలపాడు గ్రామాల నుంచి 50 పశువులను కంకోల్ సంతలో అమ్మడానికి రైతులు తీసుకువెళ్లారని గ్రామస్తులు తమముందు గోడు వెళ్లబోసుకున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. పశువుల తొట్లు, పశుగ్రాసం సమకూర్చి విలువైన పశు సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. గొర్రెలు, మేకలను రక్షించుకోవడంతో పాటు ఉపాధి కోసం గొర్రెకాపరులు నీరు, పశుగ్రాసం లభించే చోట్లకు వలసలు వెళుతున్నారన్నారు.
జిల్లాల్లో పర్యటిస్తున్న సిపిఎం బృందాలు కరువు సమస్యలను తెలుసుకుని ఈ నెల 12వ తేదీన అన్ని కలెక్టరేట్ల ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం, కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేశం, నాయకులు మాణిక్యం, ప్రవీన్, నర్సింలు, మల్లీశ్వరి, అడివయ్యపాల్గొన్నారు.