మెదక్

అప్రమత్తతతో క్రయవిక్రయాల్లో మోసాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 15: వినియోగదారులు జాగ్రతగా వ్యవహరిస్తేనే క్రయ విక్రయాలలో జరిగే మోసాలను అరికట్టవచ్చని సంయుక్త కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కనిపించే దేవుళ్లు వినియోగదారులేనని, వినియోగదారుల్లో ఎక్కువగా మోసపోతున్నది చదువుకున్న వారేనని అన్నారు. కొనుగోలు చేసిన వస్తువుల సేవలు నాణ్యతతో కూడి ఉండాలని, అట్టి విషయంలో వినియోగదారులు అశ్రద్ద, అవగాహన లేకుండా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి అవగాహన సదస్సులో అన్ని రకాల వినియోగదారులు పాల్గొని చైతన్యవంతులు కావాలన్నారు. వినియోగదారులకు అందుతున్న సేవలు, ఉన్న హక్కులపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే వినియోగదారుడిగా ఎదురవుతున్న మోసాలను అరికట్ట వచ్చని ఆయన పేర్కొన్నారు. కొలతలు, తూనికల శాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ తూనికలు, కొలతల్లో మోసాలను అరికట్టడానికి తమ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళలే అధికంగా మోసపోతున్నారని ఆయన పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రి దేవి మాట్లాడుతూ వినియోగదారులకు ఆరోగియకరమైన సేవలు అందించడంలో తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందన్నారు. వైద్య సేవల విషయంలో మోసాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ఆహార సంరక్షణ, ప్రమాణాల విభాగం అధికారి విజయకుమార్ మాట్లాడుతూ వివిధ ఆహార పదార్థాలలో ఏ విధంగా కల్తీ జరుగుతుందో వివరించారు. అలాంటి కల్తీ వస్తువులను అరికట్టడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. విద్యుత్ శాఖ ఎఇ అంజయ్య మాట్లాడుతూ విద్యుత్తు వినియోగానికి సంబంధించి వినియోగానికన్న ఎక్కువ మొత్తంలో బిల్లులు వచ్చినప్పుడు ఇతర ఏవేవి సమస్యలున్నా విద్యుత్తు వినియోగదారుల ఫోరంలో న్యాయం పొందవచ్చని సూచించారు. నాణ్యమైన విద్యుత్తు పొందడం వినియోగదారుల హక్కని తెలిపారు. మోటారు వెహికిల్ ఇన్స్‌పెక్టర్ చౌహాన్ మాట్లాడుతూ ప్రమాదకర వస్తువుల నుండి వినియోగదారులకు రక్షణ ఇవ్వాలన్న నిబంధలున్నాయని, వాటిని వినియోగదారులు అందరు గమనించాలని తెలిపారు. మద్య వర్తులతో కాకుండా ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వినియోగదారుల ఫోరం అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ డిజిటల్ వినియోగంలో వినియోగదారుల హక్కులపై అందరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. మోసపూరిత ప్రకటనలతో వినియోగదారులు మోసపోకూడదని, అలాంటి వాటి నుండి అందరూ జాగురూకులు కావాలన్నారు. వినియోగదారులు చైతన్యవంతులై జిల్లాను పూర్తి స్థాయిలో చైనత్యం కలిగిన జిల్లాగా రూపొందాలని కోరారు.
వివిధ సంస్థల అధికారులు, అనధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని తమకు ఎదురైన పలు మోసాలను తెలియజేసి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో సూచించారు. ఈ సమావేశంలో బిఎస్‌ఎన్‌ఎల్ ప్రతినిధి రాజేశ్వర్, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రభూమి వార్తకు స్పందన
కలప తరలిస్తున్న లారీ స్వాధీనం
నారాయణఖేడ్ మార్చి 15: స్మగ్లర్లు, అటవీ శాఖ అధికారులు కుమ్మక్కై ఖేడ్ అటవీ శాఖ పరిధిలోని అటవీ భూముల్లో, రైతుల పట్టాల భూముల నుంచి టేకు చెట్లు ఇప్ప, మద్ది దిర్శినం చెట్లను అక్రమంగా నరికి అమ్ముతున్నారని ఈనెల 9న ఆంధ్రభూమి పత్రికల్లో పచురితమైన వార్తకు జిల్లా అటవీ శాఖ అధికారులు స్పందించారు. స్థానిక ఫారెస్ట్ అధికారులపై జిల్లా అధికారులు మండి పడ్డారని తెలిసింది. సబ్‌రేంజ్ పరిధిలో అక్రమంగా కట్టెలను నరికి వ్యాపారం చేసుకుంటున్న స్మగ్లర్లపై వెంటనే నిఘా ఏర్పాటు చేసి పట్టుకోవాలని అదేశాలు జారీ చేశారు. మంగవారంనాడు రాత్రి 9గంటలకు కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన సూరయ్య తుమ్మ, వేప కట్టెలను వారి పట్టా భూమిల్లో నుంచి నరికి తీసుకెళ్లేందుకు పారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీను ద్వారా అనుమతి తీసుకున్నారు. అదే ఆసరాగా తీసుకున్న వ్యాపారస్థుడు అనుమతి లేని మద్ది, ఇప్ప, దిర్శనం చెట్లను నరికి లారీలో నింపుకొని తడ్కల్ నుంచి తరలిస్తుండగా జిల్లా పారెస్ట్ అధికారుల నిఘా మేరకు నారాయణఖేడ్ పట్టణ శివారులోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద స్థానిక ఫారెస్ట్ సబ్ రేంజ్ అధికారి విజయకుమార్, సెక్షన్ అధికారులు శ్రీను పట్టుకున్నారు. పట్టుకున్న లారీలోని కట్టెలకు జిల్లా అధికారుల అదేశాల మేరకు కొలతలు చేసి జరిమానా విధిస్తామని విజయకుమార్, శ్రీనులు తెలిపారు. అక్రమంగా చెట్లను నరికి తరలిస్తున్న సమాచారం అందిస్తే తప్పకుండా పట్టుకుంటామని వారు తెలిపారు. నియోజకవర్గంలో ప్రత్యేకించి స్పెషల్ పార్టీ విజిలెన్స్ స్వ్కాడ్‌ను ఏర్పాటు చేసి అటవీ శాఖ భూముల చెట్లను నరికి తరలించకుండా కాపాడుతామని వారు చెప్పారు.
గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్, మార్చి 15: మెదక్ జిల్లాలో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2017-18 సంవత్సరానికిగాను 5,6,7,8 తరగతుల యందు ఖాళీగా ఉన్న సీట్ల కొరకు ప్రవేశాలు ప్రారంభించడం జరిగిందని మెదక్ జిల్లా అల్ప సంఖ్యాకక వర్గాల సంక్షేమ శాఖ అధికారి ఎండి సలీమ్ పాషా ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ మైనార్టీ గురుకుల బాలికలు, బాలురు (నర్సాపూర్), ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేరాలనుకునే విద్యార్థులు తామ ఫొటోలు, ఆధార్‌కార్డు వివరాలతో వెబ్‌సైన్ నందు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. రిజిస్టర్ చేసుకోడానికి తుది గడువు మార్చి 31 వరకు ఉందని జిల్లా మైనార్టీ శాఖ అధికారి సలీమ్ పాషా పేర్కొన్నారు. 5, 6, 7, 8 తరగతుల్లో మెదక్ బాలికలు 215 సీట్లు ఖాళీగా ఉన్నాయని, బాలురకు (నర్సాపూర్) 166 ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు.