మెదక్

నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, మార్చి 21: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేయాలని పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టంచేసారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలకు కార్యాలయంతో పాటు నివాసగృహాన్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుతోందన్నారు. మంగళవారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆత్మకమిటీ భవనాన్ని పరిశీలించారు. ఈ సంధర్బముగా అధికారులకు, సదరు కాంట్రాక్టరుకు పలు సూచనలు చేసారు. సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన క్యాంపు కార్యాలయంలో సందర్శలకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. పనులలో వేగం మరింత పెరగాలని, సాధ్యమైనంత తొందరగా నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఆర్ అండ్ బి అధికారులు అనుక్షణం పర్యవేక్షణతో క్యాంపు కార్యాలయం నిర్మాణంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా చేయాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షల మేరకు క్యాంపు కార్యాలయ నిర్మాణం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా మారాలని అభిప్రాయపడ్డారు. పనుల జరుగుతున్న తీరును సునిశితంగా పరిశీలించిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఏమాత్రం అలక్ష్యం వహించినా సహించేది లేదన్నారు. సరైన మోతాదులో అవసరమైన ముడి పదార్థాలు కలపాలని, పది కాలాల పాటు భవనం మన్నిక సాధించేలా ఉండాలని ఆయన అన్నారు. కేవలం మూడు మాసాల వ్యవధిలో క్యాంపు భవనం నిర్మాణం పూర్తి చేయాలని, పటన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుండి అనుదినం సందర్శించే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి అంతిరెడ్డి, ఆత్మకమిటీ అధ్యక్షుడు గడీల కుమార్‌గౌడ్, పలువురు అధికారులు పాల్గోన్నారు.