మెదక్

శ్రీ విద్యాధరి క్షేత్రంలో ఘనంగా మూల ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 21: సుప్రసిద్ద వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో మూల ఉత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ ఉత్సవానికి అంకురార్పణ చేయగా, అనంతరం విశేష పంచామృత, సుగంద ద్రవ్య అభిషేకము, ప్రత్యేక పూజలు, అలంకరణ, చండీ హోమము, లక్ష ద్రాక్ష అర్చన తదితర కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా శ్రీ విద్యాధరి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల సందర్భంగా ఆలయాల సముదాయాన్ని నిర్వాహకులు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడంతోపాటు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలతోపాటు మహా ప్రసాదం అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ వ్యవస్థాపక చైర్మెన్ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్దాంతి మాట్లాడుతూ రజతోత్సవ సంబరాలను పూర్తి చేసుకోగా, భక్తుల పాలిట కల్పతరువుగా నిలిచిన శ్రీ విద్యాదరి అమ్మవారి కృపతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కాగా దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి శర వేగంగా ముందుకెల్తుండగా, భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఉపాధి హామీలో నిధుల గోల్‌మాల్
* సామాజిక తనిఖీలో వెల్లడి
* ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
అల్లాదుర్గం, మార్చి 21: ఉపాధి హామీ పనులలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న వైనాన్ని సామాజిక తనిఖీ బృందం ఉన్నతాధికారుల ముందు వెల్లడించడంతో అప్పాజిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్‌లను విధులనుంచి సస్పెండ్ చేసినట్లు డిఆర్‌డిఓ సీతారామరావు తెలిపారు. కూలీలకు పని కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధిహామీ పనులు కొందరు అక్రమార్కులకు వరంగా మారాయ. సామాజిక తనిఖీ బృందం చేపట్టిన విచారణలో జిల్లా అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించే పలు అక్రమాలు వెలుగు చూశారు. 2016 జనవరి 1 నుంచి 2017 జనవరి 31 వరకు అల్లాదుర్గం మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పలు పనులతో పాలు హరితహారం ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై సామాజిక తనిఖీ బృందం ఈ నెల 10 నుంచి మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన తనిఖీలపై మంగళవారం అల్లాదుర్గం ఇజిఎస్ కార్యాలయం వద్ద నిర్వహించిన సామాజిక తనిఖి ప్రజావేదికలో ఈ అక్రమాలను బహిర్గతం చేశారు. మండలంలోని అప్పాజిపల్లి గ్రామంలో చేపట్టిన ఉపాధి పనుల్లో సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వరమ్మ, టిఎ కొండల్‌రెడ్డి కుమ్మకై మృతి చెందిన వారిపేర్లు, భినామి పేర్లలో ఉపాధి నిధులు కాజేసినట్లు తనిఖీ బృందం వెల్లడించారు. కొందరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వారి పేర్లతో నిధులు ఖాజేసినట్లు వెల్లడైంది. ఉపాది పనులకుగాను మృతి చెందిన వారి పేర్లతో నిధులు స్వాహా చేయడం ఒకటైతే వీరి పేర్లతో పనులు కనిపించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం జిల్లా అధికారులను ఆశ్చర్యాన్ని కలిగించింది. హరితహారం కార్యక్రమం ద్వారా వేలాది మొక్కలు నాటినట్లు రికార్డులు సృష్టించినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ మొక్కలు నాటిన ఆనవాళ్లు కూడా లేవని వారు వివరించారు. ఈ మొక్కలలో జరిగిన అక్రమాల్లో ఇజియస్‌లోని ఒక టిఎ 200 మొక్కలు నాటినట్లు రికార్డులు ఉన్నప్పటికినీ రికార్డుల్లో సూచించిన స్థలంలో ఒక మొక్క కూడా లేదని వారు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధి కోసం జాబ్‌కార్డు కావాలని కోరితే కూలీల నుంచి 200 చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్ వసూలు చేసిందని కూలీలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే మండలంలోని బిజిలీపూర్, గొర్రెకల్ గ్రామాల్లో మృతి చెందినవారి పేర్లపై పనులు చేసినట్లు రికార్డులు సృష్టించి నిధులు ఖాజేసినట్లు సామాజిక తనిఖిలో వెల్లడైంది. ఈ గ్రామాల్లో కూడా మొక్కలు నాటకున్నా నాటినట్లు రికార్డులు సృష్టించి నిధులు ఖాజేసినట్లు తనిఖి బృందం జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
టిఎ, ఎఫ్‌ఎ సస్పెన్షన్ చేసిన డిఆర్‌డిఓ
మండలంలోని అప్పాజిపల్లి గ్రామంలో ఇజియస్ పనులలో మృతి చెందిన వారిపేర్లపై, హైదరాబాద్‌లో ఉంటున్న వారి పేర్లపై వారు పనిచేసినట్లు రికార్డులు సృష్టించి నిధులు ఖాజేసినందుకు, హరితహారంలో మొక్కలు నాటకున్నా నాటినట్లు రికార్డులు సృష్టించినందుకు అప్పాజిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వరమ్మ, టెక్నికల్ అసిస్టెంట్ కొండల్‌రెడ్డిలను సస్పెన్షన్ చేసినట్లు డిఆర్‌డిఓ సీతారామరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధనపు పిడి వసంత సుగుణ, ఎపిడి బాలయ్య, ఎస్‌ఆర్‌పి సీత, ఎంపిడిఓ రత్నమాల, ఇజియస్ ఎపిఓ గంగరాం తదితరులు పాల్గొన్నారు.