మెదక్

గజవాహనంపై ఊరేగిన శ్రీ లక్ష్మి నారసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 23: నాచగిరి శ్రీ లక్ష్మి నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సతీసమేతులైన శ్రీ స్వామివారు గజవాహనంపై ఊరేగారు. వేద పండితుల మంత్రోశ్చరణలు, భక్తజనుల జయజయ ద్వనుల మద్య శ్రీ లక్ష్మి, శ్రీ నృసింహస్వామి విగ్రహాలను పుష్పమాలలు, పట్టువస్త్రాలతో అందంగా అలంకరించిన గజ వాహనంపై అదిష్టింపజేశారు. అనంతరం నాచగిరి పురవీదుల్లో స్వామివారిని ఊరేగించగా, ఈ కార్యక్రమాలలో ఆలయ కార్యనిర్వాహణాధికారి సుధాకర్‌రెడ్డి, వేద పండితులు చంద్రకాంతశర్మ, కృష్ణమాచార్యులు, జగన్నాదాచార్యులు, శ్రీనివాసరాఘవన్, గోపాలకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు. కాగా మొదటగా మూలవర్యులకు విశేష పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలు, పూలమాలలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్బంగా స్వామివారిని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రావుల గిరిదర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ప్రధాన అర్చకులు కృష్ణమాచారి నేతృత్వంలో ఏసిపిని సన్మానించి స్వామివారి జ్ఞాపికతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రాతియుగం సమాధుల
తవ్వకాలు పరిశీలించిన ఏసిపి
నంగునూరు, మార్చి 23: మండలంలోని నర్మెటలో పురావస్తు శాఖ చేపడుతున్న పురాతన సమాధుల తవ్వకాలను సిద్దిపేట ఏసిపి నర్సింహారెడ్డి, తహశీల్దార్ విజయ్‌కుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్ పరిశీలించారు. తవ్వకాల్లో వెలువడ్డ ఎముకలు, కుండలు పరిశీలించారు. 2రోజుల కింద తెరిచిన పెద్ద మ్యాన్‌హోల్‌ను పరిశీలించారు. ఇవి రాతియుగం నాటి మానవుల ఆనవాళ్లని అధికారి నాగరాజు వారికి వివరించారు. టెన్త్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో అధికారులు గంగాదేవి, భానుమూర్తి, గ్రామస్తులు నారాయణ పాల్గొన్నారు.