మెదక్

రూ.657.55 కోట్లతో గ్రామీణ రోడ్ల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఏప్రిల్ 8: మెదక్ జిల్లా గ్రామస్థాయి రోడ్ల అభివృద్దికి రూ.657.55 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని మెదక్ జిల్లా పంచాయితీరాజ్ శాఖ సూపరిండెంట్ ఆఫ్ ఇంజనీర్ సి.ఆనందం తెలిపారు. శుక్రవారం నాడు ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ మెదక్ జిల్లా గ్రామస్థాయిలో జరుగుతున్న అభివృద్ది పనులపై వివరించారు. సిఆర్‌ఆర్ గ్రాంట్ నిధుల నుండి మెటల్ రోడ్లను బిటి రోడ్లుగా అభివృద్ధి చేయడానికి 249 పనులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ పనుల కోసం 356.19 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. ఈ నిధులతో 664.83 కిలోమీటర్ల పొడవున మెటల్ రోడ్డు నుండి బిటి రోడ్డుగా మార్చే పనులు కొనసాగుతున్నాయని ఆనందం తెలిపారు. ఇందులో 91 పనులు పూర్తి అయినట్లు తెలిపారు. 664.83 కిలోమీటర్ల బిటి రోడ్డులో భాగంగా 203.53 కిలోమీటర్ల పొడవున మెటల్ నుండి బిటి రోడ్లుగా మార్చడం జరిగిందన్నారు. ఇందుకోసం 100.15 కోట్లు ఖర్చు చేసినట్లు ఆనందం తెలిపారు. మిగిలిన పనులు అభివృద్ది దశలో నడుస్తున్నట్లు తెలిపారు. ఎంఆర్‌ఆర్ గ్రాంట్‌లో భాగంగా బిటి రోడ్ల మరమ్మతు పనులకు 213.37 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ నిధులతో 507 పనులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధుల ద్వారా 1525 కిలోమీటర్ల పొడవు పనులు చేయాల్సి ఉందన్నారు. ఇందులో 958.9 కిలోమీటర్ల పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. 507 పనులలో భాగంగా 313 పనులు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందుకు 83.36 కోట్లు ఈ పనులకు పేమెంట్ చేయడం కూడా జరిగిందన్నారు. మిగిలిన పనులన్నియు కూడా అభివృద్ది దశలో నడుస్తున్నట్లు తెలిపారు. నాబార్డు 20లో 43 బ్రిడ్జీలు మంజూరైనట్లు ఎస్‌ఈ ఆనందం తెలిపారు. 35.16 కోట్లు ఈ బ్రిడ్జీల నిర్మాణం కోసం ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఇందులో 12 బ్రిడ్జీలు పూర్తి చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి బ్రిడ్జీ రద్దు చేసినట్లు తెలిపారు. నాబార్డు 21లో 37 బ్రిడ్జీలు మంజూరైనట్లు తెలిపారు. ఈ పనుల కోసం 29.33 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ పనులన్నియు కూడా టెండర్ దశలో ఉన్నట్లు తెలిపారు. స్పెషల్ గ్రాంట్ క్రింద 16 పనులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఈ పనుల కోసం 18.46 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులకు సంబంధించిన పనులన్ని పూర్తి చేసినట్లు ఎస్‌ఇ ఆనందం తెలిపారు. మెదక్ జిల్లాలో 1077 గ్రామపంచాయితీలు ఉన్నాయని, 1279 హ్యాబిటేషన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. 2270 రోడ్లు జిల్లా గ్రామపంచాయితీ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ఈ రోడ్ల విస్తీర్ణం 6016 కిలోమీటర్లు ఉన్నట్లు ఆనందం తెలిపారు. ఇందులో బిటి 2552 కిలోమీటర్లు, మెటల్ 1202 కిలోమీటర్లు, సిసి రోడ్లు 207 కిలోమీటర్లు, మట్టి, గ్రావెల్ 2055 కిలోమీటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వంలో గ్రామస్థాయి రోడ్లు అభివృద్దికి నోచుకున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో యుద్ద ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. వర్షాకాలంలోగా వివిధ గ్రాంట్‌ల ద్వారా విడుదలైన నిధులతో రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్‌ఈ తెలిపారు. ఎక్కడ కూడా నాణ్యత లోపించినా ఆ పనుల విషయంలో పేమెంట్లు నిలిపివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని కూడా తెలిపారు.