మెదక్

మరో 10 రోజుల్లో గజ్వేల్‌కు స్వచ్ఛమైన గోదావరి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 24: గజ్వేల్ పట్టణంలోని ప్రజల దాహార్తి సమస్యను పరిష్కరించేందుకు మరో 10 రోజుల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 16వ వార్డులో మిషన్ భగీరథ పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ పరిధిలోని చాలా ప్రాంతాలల్లో ఇప్పటికే పనులు చివరి దశకు చేరుకోగా, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శంకర్, కౌన్సిలర్ నయూమున్నీసా బేగం, నేతలు జకియొద్దీన్, బూపాల్‌రెడ్డి, కళ్యాణ్‌కర్ శ్రీనివాస్, ఆకుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల దుకాణంపై అధికారుల దాడి
గజ్వేల్, మార్చి 24: గజ్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటరమణ ట్రేడర్స్ మందుల దుకానంపై శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జాలిగామకు చెందిన ఓ రైతు ఫిర్యాదు మేరకు ఫర్టిలైజర్ దుకానంపై దాడి చేసి రికార్డులు స్వాదీనం చేసుకోవడంతోపాటు మందుల విక్రయాలను నిలిపివేశారు. దుకాన యజమాని పురుగు మందులను అధిక దరకు విక్రయించడంతోపాటు రికార్డులు సక్రమంగా రాయకపోవడం, రైతులు బిల్లులు ఇవ్వకపోవడం తనిఖీలో తమ దృష్టికి వచ్చిందని వ్యవసాయాధికారి ప్రవీన్‌కుమార్ పేర్కొన్నారు. దీంతో దుకానంలో పురుగుల మందుల విక్రయాలను నిలిపివేయడంతోపాటు దుకాన యజమానికి శోకాజు నోటీసులు జారీ చేసి రికార్డులు స్వాదీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆయన వెంట సహాయ వ్యవసాయాధికారి గణేష్ కూడా పాల్గొన్నారు.

అసెంబ్లీ నియోజకవర్గంగా రామాయంపేట
* టిపిసిసి కార్యదర్శి
చౌదరి సుప్రభాత్‌రావు డిమాండ్
రామాయంపేట, మార్చి 24: రామాయంపేటను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాత్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మాజీ ఎంపిపి రమేష్‌రెడ్డితో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర, తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని నిర్ణయించినందున అన్యాయానికి గురై వెనుకబడిన రామాయంపేటను అసెంబ్లీ నియోజకవర్గంగా చేయాలని వారు కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి నుంచి టి.అంజయ్య గెలిచి ముఖ్యమంత్రి అయిన చరిత్ర రామాయంపేటకు ఉందన్నారు. రెవెన్యూ డివిజన్ విషయంలో మంత్రి హరీష్‌రావు రామాయంపేటకు న్యాయం చేస్తానని చెప్పడంతో తాము దీక్షలు విరమించామని ఇప్పుడు మంత్రి హరీష్ చొరవ తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి అసెంబ్లీ స్థానం దక్కెటట్లు కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో అఖిలపక్షం అద్వర్యంలో మరో ఉద్యమం చేస్తామన్నారు. కార్మికులు, కర్షకులు, మేథావులు, వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు ఈప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో హస్నోద్దీన్, చింతల స్వామి, గణేష్, రాకేష్, రవితో పాటు పలువురు ఉన్నారు.