మెదక్

ముట్టడికి వెళ్లే కమలదండు కట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, మార్చి 24: ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తారనే అనుమానంతో ముందస్తుగా రామాయంపేటలో బిజెపి నాయకులను గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రామాయంపేట, నిజాంపేట మండలం నుంచి కొంతమంది నాయకులు రహస్యంగా రైలులో హైద్రాబాద్‌కు వెళ్లగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆపార్టీ నాయకుడు సుదాకర్‌రెడ్డి తెలిపారు. ఈసందర్బంగా అసెంబ్లీ కన్వీనర్ వెల్ముల సిద్దరాములు మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ నిర్బందాలు ఎన్ని చేసినా ముస్లింలకు కేటాయింసే రిజర్వేషన్ల పట్ల బిజేపి ఉద్యమిస్తుందన్నారు. అరెస్టయిన వారిలో రఘుపతిగౌడ్, నవాత్‌రాజు, నర్సింలు, రాము, బాల్‌చంద్రం, శంకర్, చింతల శేఖర్‌లు ఉన్నారు.

సిద్దిపేట మెడికల్ కళాశాలకురూ.750కోట్లు మంజూరు

సిద్దిపేట, మార్చి 24: సిద్దిపేట మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.750కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో నూతన జిల్లా ఏర్పాటులో భాగంగా దసరానాడు సిద్దిపేట జిల్లాను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ను మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. కళాశాల మంజూరు చేస్తామని సిఎం సభాముఖంగా ప్రకటించారు. కళాశాల నిర్మాణానికి సుమారు 25ఎకరాలు సిద్దిపేట శివారు ఎన్సాన్‌పల్లి వద్ద అధికార యంత్రాంగం ఖరారు చేసింది. ఏరియా హాస్పిటల్‌ను 300బెడ్లుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. కళాశాల ఏర్పాటు కోసం రాష్ట్ర వైద్యాధికారులు సిద్దిపేటను సందర్శించి స్థల పరిశీలన, ఆస్పత్రి విభాగాలు పరిశీలించారు. సుముఖత వ్యక్తం చేసి ఎంసిఐకి దరఖాస్తు చేశారు. 2నెలల్లో ఎంసిఐ బృందం స్థలాన్ని పరిశీలించి బాగున్నాయని భావిస్తేనే ఎంసిఐ అనుమతి వచ్చే అవకాశం ఉంది. మంత్రి హరీష్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెడికల్ కాలేజి ఏర్పాటుకు అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 750కోట్లు మంజూరు చేయడంలో మంత్రి పాత్ర ఎంతో ఉంది. కళాశాల నిర్మాణం వేగవంతమయ్యే అవకాశం ఉంది. నర్సింగ్ కళాశాల సైతం మంజూరు చేశారు. సిద్దిపేటలో సెమీ అటానమస్‌గా కళాశాలను నిర్మించనున్నారు. 2018-19నుంచి కళాశాల తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో మరింత మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. 750కోట్లు మంజూరీపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

క్షయ నివారణకు సమష్టి కృషి
సూచించారు. అనంతరం క్షయవ్యాది నివారణకు ఉత్తమ సేవలందించిన సిబ్బంది, ఆశ కార్యకర్తలకు ప్రసంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా లెప్రస్ అధికారి డాక్టర్ మహేందర్‌రెడ్డి, జిల్లా మలేరియా అధికారి నాగయ్య, మహేశ్వర మెడికల్ కళాశాల ప్రోఫెసర్ కిష్టయ్య, ఎంఎన్‌ఆర్ కళాశాల ప్రోఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.