మెదక్

మిషన్ కాకతీయ మూడవ దశలో జిల్లాకు 113 చెరువులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మార్చి 25: మిషన్ కాకతీయ పథకం పనులు ఇతర రాష్ట్రాలూ, విదేశీయులను కూడా ఆకట్టుకుంటున్నాయని, ఈ క్రమంలోనే పలు ప్రతినిధి బృందాలు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేశాయని ఇఇ ఏసయ్య తెలిపారు. ఇప్పటి వరకు మొదటి, రెండవ దశ పనులు జరుగగా మూడవ దశలో మెదక్ జిల్లాలో 407 చెరువులు ప్రతిపాధించగా 113 చెరువులు మంజూరైనట్లు ఇవన్ని టెండర్ పూర్తి చేసుకొని పనులను అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు తెలిపారు. మొదటి దశలో 560 చెరువులకుగాను 552 చెరువులు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన 8 చెరువులలో నీళ్లు రావడంతో ఆ పనులు నిలిచిపోయాయన్నారు. నీరు తగ్గిన తరువాత ఆ చెరువుల పనులు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. రెండవ దశలో 665 చెరువులు మంజూరు కాగా అందులో 356 చెరువులు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన చెరువు పనులు కొనసాగినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పనుల అభివృద్దికిగాను గ్రామ కమిటిలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెరువు పనులపైన తహశీల్దార్, ఎంపిడిఓ వ్యవసాయ శాఖ అధికారి అనే ముగ్గురు జరుగుతున్న పనులపై ఇన్స్‌ఫెక్షన్ చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు రిపోర్టు ఇస్తారన్నారు. మిషన్ కాకతీయ పథకంలో ప్రజల భాగస్వామం ఉన్నట్లు ఆయన తెలిపారు. చెరువులో ఉన్నటువంటి మట్టిని రైతులు ట్రాక్టర్ల ద్వారా తరలించుకొని వారి భూములలో నింపుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్లానింగ్ ప్రకారమే చెరువుల అభివృద్ధి జరుగుతుందన్నారు. అందువలన మిషన్ కాకతీయ పనులన్నియు కూడా పారదర్శకంగా కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. మొదటి దశలో మంజూరై పూర్తి అయిన చెరువులకు 60 కోట్లు పేమెంట్ చేయడం జరిగిందని ఇఇ తెలిపారు. రెండవ దశ పనుల్లో పూర్తి అయిన చెరువులకు 30 కోట్లు పేమెంట్ చేయడం జరిగిందన్నారు. కాగా మిషన్ కాకతీయ పనుల్లో వస్తున్న ఆపోహలను ఎవరు నమ్మకూడదని, ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల అభివృద్ధి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

మెదక్ బిసి బాలికల హాస్టల్‌లో
దొంగల స్వైరవిహారం
* పట్టించుకోని అధికారుల వైఖరిపై కలెక్టర్ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఫిర్యాదు
మెదక్, మార్చి 25: మెదక్ పట్టణంలో బిసీ బాలికల హాస్టల్‌లో దొంగలు చొరబడుతున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం వినతి పత్రం అందజేసినట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.బస్వరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయానికి అతి దగ్గరలో ఉన్న బిసీ బాలికల వసతి గృహంలో శుక్రవారం అర్దరాత్రి దొంగలు చొరబడ్డారు. హాస్టల్ ప్రక్కనే గల మట్టికుప్పలపై నిచ్చన వేసుకొని దొంగలు హాస్టల్‌లోనికి చొరబడ్డారని ఆయన తెలిపారు. అమ్మాయిలు పడుకునే హాల్‌లోకి వెళ్లి వారి పెట్టెలో ఉన్న బట్టలను చిందరవందర పడవేసి పెట్టెలలోని డబ్బులను ఎత్తుకెళ్లారని ఆయన తెలిపారు. విద్యార్థులు భయపడి, ఏడుస్తూ అరుపులు పెట్టడంతో సమీపాన ఉన్న అగ్నిమాపక దళం సిబ్బంది ఆ ప్రదేశానికి వెళ్లడంతో దొంగలు పారిపోయారని ఆయన తెలిపారు. హాస్టల్‌లో ఉన్న సమస్యలపై గతంలో అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ బిసీ జిల్లా అధికారి పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్‌కుమార్, కార్యదర్శి బస్వరాజ్ పేర్కొన్నారు.