మెదక్

తెలంగాణలో రామరాజ్య స్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 26: తెలంగాణలో ప్రజాస్వామ్యమైన పాలన తెచ్చి రామరాజ్య స్థాపనకు బిజెపి కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ అన్నారు. యూపి తరహా ఫలితాలు తెలంగాణలో బిజెపి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రం పొన్నాల శివారు వద్ద విలేకర్లతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ అధికార బలంతో ప్రతిపక్షాల గొంతునొక్కుతుందన్నారు. రాజకీయంగా ఎదురుదాడి చేస్తుందని, బిజెపి ఇలాంటి వాటికి బెదరదన్నారు. బిజెపి సిద్దాంతాలతో పనిచేస్తుందని, అధికారం కోసం పాకులాడదన్నారు. అసెంబ్లీలో గొంతువిప్పితే మెడలుపట్టి బయటకు గెంటే కొత్త ఒరవడికి టిఆర్‌ఎస్ శ్రీకారం చుట్టిందన్నారు. ఇలాంటి చర్యలు తెలంగాణ సమాజం హర్షించదన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నించే ప్రజాసంఘాలు, నేతలను అణిచివేసే చర్యలకు పాల్పడుతుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఏలాంటి ధర్నాలు, ఆందోళనలు లేకుండా ప్రజాస్వామ్యపాలన అందిస్తామని కెసిఆర్ నమ్మబలికాడని, కానీ ధర్నాచౌక్‌ను ఎత్తివేసి ధర్నాలు లేకుండా చేస్తున్నట్లు స్పష్టమైతుందని, ఇది మంచిది కాదన్నారు. బిజెపి ప్రజాహక్కుల కోసం పోరాడుతుందని, రాజ్యాంగ విరుద్ద విధానాల పై వ్యతిరేకిస్తున్నామన్నారు. అసెంబ్లీ లోపల, బయట రాజకీయ పోరాటం చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే కొత్త ఒరవడి తెచ్చారని, తెలంగాణ సమాజానికి మచ్చలాంటిదన్నారు. అవినీతి, కుటుంబపాలన, నియంతృత్వ పోకడలను తెలంగాణ సమాజం హర్షించదన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు క్రియాశీలక పాత్రపోషించారని, బంగారు తెలంగాణ కోసం భాగస్వాములై పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టే విధానాలు తెస్తుందన్నారు. కార్మికులకు అండగా బిజెపి ఉద్యమిస్తుందన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారమయ్యే దాకా పోరాడుతామన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజామద్దతుతో అసెంబ్లీలో బిల్లుపెట్టకుండా అడ్డుకున్నట్లుగానే సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కుల కోసం పోరాడుతామన్నారు. కార్మికుల వారసత్వ ఉద్యోగాల కోసం తప్పుడు జిఓలు తెచ్చి వారిని అడ్డుకున్నారన్నారు. లక్షకు పైగా కార్మికులు ఉంటే నేడు 60వేల మందే ఉన్నారన్నారు. 6జిల్లాల ప్రాంతీయ సదస్సు గోదావరిఖనిలో నిర్వహిస్తున్నామని, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే దాకా బిజెపి అండగా ఉంటుందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న సర్కార్‌కు ప్రజలు బుద్ది చెప్పేరోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. తెలంగాణలో బిజెపి పుంజుకుంటుందని, భవిష్యత్‌లో అధికారంలోకి వస్తామన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నేతలు విద్యాసాగర్, కౌన్సిలర్లు శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్ పాల్గొన్నారు.