మెదక్

గ్రామ స్వరాజ్యమే సర్కారు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మార్చి 26: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ ఉపసభాపతి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను తూతూ మంత్రంగా కేటాయిస్తూ వాటిని అమలు చేయక, ఆ నిధులు మురిగిపోతుండేటివన్నారు. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నిధులు అమలుకు నోచుకునే విధంగా బడ్జెట్‌లో గట్టి బిల్లును ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ఈ నిధులు ఒక సంవత్సరం వాడకంలో లేకపోయినప్పటికీ తిరిగి మరో సంవత్సరం ఖర్చుపెట్టే విధంగా శాసనసభలో బిల్లును పాస్ చేసినట్లు ఆమె తెలిపారు. 2013లో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సవరణ చేస్తూ అట్టడుగు ప్రజలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నిధుల కేటాయింపు జరిగిందన్నారు. ఆర్దిక సావలంభనతో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు అభివృద్దిలోకి రావాలన్నదే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆమె తెలిపారు. మెదక్‌లో అంబేద్కర్ భవనం నిర్మాణానికి రెండు కోట్లు, ఎస్టీ భవనానికి ఒక కోటి రుపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ రెండు భవనాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ క్రింద స్పెషల్ కాంపోనెంట్ క్రింద ఎస్సీ, ఎస్టీలకు తొమ్మిది కోట్ల రూపాయలు, సిసి రోడ్లకు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దాంతో పాటు మరో ఐదు కోట్ల రుపాయలు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సిసి రోడ్లకు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. తన అభివృద్ది నిధుల నుండి 1.30 కోట్లను కూడా సిసి రోడ్లకు ఖర్చు చేయబోతున్నట్లు ఆమె తెలిపారు. గ్రామాల్లో డంప్‌యార్డులు నిర్మాణం కోసం, ఎన్‌ఆర్ ఇజియస్ క్రింద 10 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయితీలో భవనం, అంగన్‌వాడి భవనాలు నిర్మించడానికి ఒక్కొక్క గ్రామానికి రెండు లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో కులవృత్తుల వారి ఆర్దిక పరిస్థితులు మెరుగుపర్చడానికి నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల వారికి నిధులు కేటాయించారని ఆమె తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో పేదల బడ్జెట్‌గా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రూపుదిద్దారని ఆమె తెలిపారు. ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరికి నమ్మకం కల్పించిందన్నారు. అన్ని వర్గాలు, కులాలకు బడ్జెట్‌ను అందజేశారని ఆమె తెలిపారు.

పండితులను గౌరవించడం సత్సంప్రదాయం

* శ్రీ విద్యా సరస్వతి క్షేత్ర వ్యవస్థాపకులు చంద్రశేఖర శర్మ
గజ్వేల్, మార్చి 26: సమాజాభివృద్దిని కాంక్షించే వివిద రంగాల ప్రముఖులు, పండితులను గౌరవించి సన్మానించడం మంచి సాంప్రదాయమని ప్రముఖ వాస్తు సిద్దాంతి, శ్రీ విద్యా సరస్వతి క్షేత్ర వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ పేర్కొన్నారు. నాచగిరి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వేద పండితులు గంగు దివాకర్‌రావును శ్రీమోకిరాల ప్రభాకరశర్మ స్మారకవైదిక పురస్కారం అందజేసి సన్మానించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. ఆద్యాత్మిక చింతనకు ఆలవాలమైన నాచగిరి శ్రీ లక్ష్మీనృసింహ క్షేత్రం భక్తులపాలిట కల్ప తరువుగా, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్దికెక్కినట్లు స్పష్టం చేశారు. కాగా మొదటగా జ్యోతిప్రజ్వలనతో నాచగిరి క్షేత్రంలో ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం సిద్దాంతి చంద్రశేఖరశర్మ, మర్పడగ శ్రీ సంతాన మల్లికార్జున క్షేత్ర వ్యవస్థాపకులు డాక్టర్ చెప్పెల హరినాథశర్మలు ధార్మికోపాన్యాసం చేశారు. అలాగే వర్గల్ శ్రీ విద్యాదరి క్షేత్ర వేద విద్యార్థులచే సామూహిక దేవ పఠనము, సాంస్కృతిక కార్యక్రమాలు, జ్ఞానిక నృత్యాలయము వారిచే భరతనాట్య ప్రదర్శణ, ప్రసాద్ బృందంచే భక్త ప్రహ్లాద రూపకం, దూళిపాల శివరామకృష్ణ భాగవతార్‌చే హరికథ కాలాక్షేపం కార్యక్రమాలు జరిగాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి సుధాకర్ రెడ్డి, నాచగిరిక్షేత్ర మాజీ ట్రస్ట్‌బోర్డు అధ్యక్షులు పంజాల సత్యనారాయణ గౌడ్, దర్శనం వెంకటరమణశర్మ, రాంప్రసాద్‌రావు, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.