మెదక్

బడ్జెట్‌లో అధికశాతం అవాస్తవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మార్చి 27: శాసనసభలో లక్షల కోట్లు బడ్జెట్ ప్రకటించినా అందులో కూడా ప్రభుత్వం అబద్దాలను జొప్పిస్తోందని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్ రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో రెండు లక్షల డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఇందులో కేవలం రెండు వేల ఇళ్ల్లను మాత్రమే నిర్మించారని, మిగిలిన 1.98 లక్షల డబుల్ బెడ్‌రూమ్‌లను ఎప్పుడు నిర్మిస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంటికో ఉద్యోగం ప్రకటించి దానిని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ప్రక్రియ ఎక్కడా ప్రారంభం కాలేదని ఆయన తెలిపారు. ఎస్సీల ఆర్థికాభివృద్దికిగాను మూడు ఎకరాల భూమిని ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈ బడ్జెట్‌లో పొందుపర్చలేదన్నారు. కేజి టు పీజి కూడా బడ్జెట్‌లో లేదన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 50 వేల టీచర్ల పోస్టులు భర్తి కాలేదని ఆయన తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లాకు ఒకటి ఏర్పాటుపై ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశపెట్టిన తరువాత ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో మోడల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎట్టకేలకు మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడింది. గతంలో మెదక్‌లో ఉన్న ఎంసెట్ పరీక్షా కేంద్రం మెదక్‌లో నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో 10వ తరగతి పేపర్లు కరెక్షన్ మెదక్ గోల్ బంగ్లాలో నడిచేదని ఇప్పుదని పటాన్‌చెరుకు తరలించడం జరిగిందన్నారు. ఈ విషయంలో జిల్లా మంత్రి హరీష్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చొరవ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మెదక్‌లో ఎంసెట్ కేంద్రం లేకపోవడం దురదృష్టకరమన్నారు. దాని వలన సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్ సెంటర్లకు ఎంసెట్ విద్యార్థులు వెల్లవలసి ఉందన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వెంటనే చర్య తీసుకొని మెదక్‌లో యదావిధిగా ఎంసెట్ కేంద్రాన్ని కొనసాగింపజేయాలని ఆయన కోరారు. తెరాస గవర్నమెంట్ ఎన్నికల ప్రణాళికలో వంద హామీలను ఇచ్చిందన్నారు. తెరాస ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో ఆ హామిలు అమలు చేశారో లేదో ప్రశ్నించుకోవాలని ఆయన తెలిపారు. ఇకనుండి కడప కడపకు కాంగ్రెస్ ప్రజలతో మమేకమై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను వివరిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షకీర్, సిద్దిరాములు, ఆంజనేయులు, గూడూరి ఆంజనేయులుగౌడ్, కొండ శ్రీనివాస్‌గుప్త, శ్యామ్‌సుందర్, శ్రీనివాస్‌గౌడ్, మార్గం ఆంజనేయుల, విఠల్‌నాయక్, బి.అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు
కృషి అభినందనీయం

గజ్వేల్, మార్చి 27: హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడిన రామకోటి భక్తసమాజం ఉగాది పురస్కారాలు అందించడం ప్రశంసనీయమని జాతీయ సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేశ్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం రామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కండేయ క్షేత్రంలోవివిధ రంగాలకు చెందిన చకినాల పావని (జగదేవ్‌పూర్), నాయకం విజయలక్ష్మి (జాలిగామ), మాడూరు బల్‌రాం (కుకునూర్‌పల్లి), నక్కి రాములు (బూర్గుపల్లి)లకు ఉగాది పురస్కారాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మానవుడిని కష్టాలకడలి నుంచి గట్టెక్కించే తారక మంత్రం శ్రీరామ నామం లిఖించడం కాగా, గత పనె్నండేళ్లుగా లక్షలాది అమృత రామనామాలు వేలాది మంది భక్తులతో లిఖింపజేస్తున్న రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామరాజు అభినందనీయులని కొనియాడారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొని మానసిక ప్రశాంతత పొందాలని, భగవంతుడి స్మరణతో సర్వపాపాల నుంచి విముక్తి కలిగి ముక్తికి మార్గం దొరుకుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీనివాసాచార్యులు, శంకరశర్మ, మఠం శివకుమార్, ఉమ్మయ్య, రామాచార్యులు, సభ్యులు ప్రభాకర్, సిద్ది భిక్షపతి, రాజారాం, జగదీశ్వర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
నాచగిరి క్షేత్రం మహిమాన్వితం
* మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి
గజ్వేల్, మార్చి 27: సుప్రసిద్ధ నాచగిరి శ్రీ లక్ష్మీనృసింహ క్షేత్రాన్ని సోమవారం కేంద్ర జాతీయ విపత్తుల కమిటీ మాజీ చైర్మెన్, సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ సహాయ కమిషనర్ సుధాకర్‌రెడ్డి, వేద పండితులు చంద్రకాంత శర్మ, కృష్ణమాచార్యులు, జగన్నాదాచార్యులు, శ్రీనివాసరాఘవన్, రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ నాచగిరి క్షేత్ర మహాత్మ్యం చాలా గొప్పదని, ప్రశాంత వాతావరణంలో వెలసిన శ్రీ స్వామివారు భక్తులపాలిట కల్పతరువుగా, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధికెక్కినట్లు చెప్పారు. కాగా ఈ మధ్య కాలంలో ఆలయ అభివృద్ధి వేగంగా జరుగుతూ భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తుండడం హర్షణీయమని తెలిపారు.
అక్రమ లేఔట్లపై ఫిర్యాదు
హత్నూర, మార్చి 27: మండల పరిధిలోని కాసాల గ్రామ శివారులో గల అక్రమ లేఔట్లపై సోమవారం పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ యాదగిరి, నాయకులు కె.వెంకటేశంలు తెలిపారు. కాసాల గ్రామ పంచాయతీ హెచ్‌ఎండిఎ పరిధిలో ఉన్నందున నిబంధనలకు లోబడి వెంచర్లు ఏర్పాటు చేయాలన్నారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు నిబంధనలకు విరుద్దంగా అనుమతులు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ విషయమై పలుమార్లు మండల, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన నామమాత్రపుచర్యలతో వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైన అక్రమ వెంచర్లపై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.