మెదక్

గజ్వేల్‌లో రూ. 146 కోట్లతో ఎడ్యుకేషనల్ హబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 27: గజ్వేల్ పట్టణంలో రూ. 146 కోట్ల వ్యయంతో ఎడ్యుకేషన్‌హబ్ ఏర్పాటు చేస్తుండగా, మరో 2 నెలల్లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని జిల్లా కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఎడ్యుకేషన్ హబ్ ప్రాంతాన్ని పరిశీలించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. 40 ఎకరాలలో బాలుర ఎడ్యుకేషన్ హబ్, 20 ఎకరాలలో బాలికల ఎడ్యుకేషన్‌హబ్ ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. ఈ ఎడ్యుకేషన్‌హబ్‌లో పాఠశాల, కళాశాల, డిగ్రీ కళాశాలలతోపాటు ఆయా విద్యార్థులకు సకల వసతులతో కూడిన హాస్టల్స్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ప్రిన్సిపాల్, సిబ్బంది, టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందిలకు కూడా రెసిడెన్షియల్ వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. అంతేగాకుండా విద్యార్థులకు ఆడిటోరియం వసతి కల్పిస్తుండగా, యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి, ఆడిటోరియం నిర్మాణం తదితర పనులను కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట జెసి హన్మంతరావు, జిల్లా వ్యవసాయాధికారి ప్రవీన్‌కుమార్, తహశీల్దార్ భిక్షపతి, అధికారులు పాల్గొన్నారు.