మెదక్

ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 27 : ప్రజావాణిలో ప్రజల వివిధ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు.
దరఖాస్తులను ఎండస్ చేసి సంబంధిత అధికారులకు పంపించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఏంతో నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి హజరై సమస్యలను విన్నవిస్తున్నారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండ వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజావాణిలో సమస్యలను నెలరోజుల్లో తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన సమస్యలను నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు. ఈకార్యక్రమంలో జెసి హన్మంత్‌రావు, డిఆర్‌ఓ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంప్‌యార్డులు

సిద్దిపేట, మార్చి 27 : జిల్లాలోని అన్ని గ్రామాల్లో వైకుంఠదామాలు, డంప్‌యార్డుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి శుక్రవారం కల్లా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రతిపాదనలు పంపించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హన్మంత్‌రావు అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం నుంచి మండల తహశీల్దార్లు ఎంపిడిఓలలో నిర్ణయించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జెసి మాట్లాడారు. వైకుంఠ దామాలు, డంప్‌యార్డులు ఏర్పాటుకు ఎంపిడిఓలు, తహశీల్దార్లు, సర్పంచ్, ఎంపిటిసిలు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి స్థలం పరిశీలించాలన్నారు. రెవెన్యూ డివిజన్ అధికారులు తమ డివిజన్‌కు సంబంధించిన ప్రతిపాదనను ప్రొఫార్మాలో పంపించి స్థలాలను అప్పగించాలన్నారు. జివో 59 ప్రకారం వచ్చిన దరఖాస్తులను, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దళితులకు భూమి కొనుగోలు పథకం కింద సాగుయోగ్యమైన భూములను గుర్తించి, అర్హులైన లబ్ధిదారులను ఎంపికచేసి ప్రతిపాదనలు రెండు రోజోల్లో పంపించాలని ఆర్డీఓను ఆదేశించారు. ఎప్రిల్ 14న అంబేద్కర్ జయంతిన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు, వెంటనే పంపించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ప్రగతిలో ఉన్న పనులు పూర్తి చేసి చెల్లింపులు చేయాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సత్యనారాయణరెడ్డికి సూచించారు. వివిధ మండలాల్లో పెండింగ్‌లో ఉన్న సోప్ కిట్స్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ కింద బర్రెలు, గొర్రెల షెడ్స్ గ్రామాల్లో ఒకే నమూనాలో నిర్మాణాలు చేయాలన్నారు. ఉపాధి పనులు జరుగుతున్న గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. హరితహారం నర్సరీలో షేడ్ నెట్స్ ఏర్పాటు చేసి ఎండల నుంచి మొక్కలను కాపాడాలన్నారు. ఈవీడియో కాన్పరెన్స్‌లో డిఆర్‌ఓ చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈవోపిఆర్‌డి జాయింట్ చెక్ పవర్ రద్దు కోరుతూ
సర్పంచ్‌ల చలో కలెక్టరేట్
నారాయణఖేడ్ మార్చి 27: ఈవోపిఅర్‌డికి సర్పంచ్‌ల పై అనుబంధ చెక్‌పవర్‌ను రద్దుచేయాలని కోరుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 100 మంది సర్పంచ్‌లు పార్టీలకతీతంగా సోమవారం చలో కలెక్టరేట్‌ను చేపట్టారు. సర్పంచ్‌లు నిధులు డ్రా చేయాలంటే ఈవోపిఅర్‌డి అధికారి సంతకం చేయాలన్న లిబంధన ఉంచడాన్ని సర్పంచ్‌లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావుశెట్కార్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసేందుకు ఖేడ్ నియోజకవర్గ సర్పంచ్‌లు తరలివెళ్లారు. ఇందులో నారాయణ, సిద్దు, నర్సింలునిర్మాల, మల్లేషం నాగమణి, అంజయ్య, పార్వతి, లక్ష్మిబాయిచందర్, సిద్దు, సాయిరెడ్డి, అనిల్‌కుమార్ నర్సయ్య, సంగ్‌శేట్టి, పూజప్రశాంత్, శశికళ సంజివులు తదితరులు ఉన్నారు.

గిట్టుబాటు ధర కల్పనకు చర్యలు
సివిల్ సప్లయ్, పిఎసిఎస్, ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి

సిద్దిపేట, మార్చి 27 : రబీ సీజన్‌లో జిల్లాలో 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు రానుందని, రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా 1.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. సోమవారం పౌరసరఫరాల శాఖ రూపోందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఐకెపి కేంద్రాల ద్వారా 95 కొనుగోలు కేంద్రాలు, పిఎసిఎస్‌ల ద్వారా 58 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 31 బాయిల్డ్ రైస్ మిల్లుల్లో కొనుగోలు చేసిన ధాన్యం ఇవ్వటానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో నాణ్యత నిర్ణయించేందుకు ఎఇఓను నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. రబీ సీజన్‌లో ధాన్యం మార్కెట్‌కు వచ్చే విషయంలో డివిజన్ పరిధిలో ఆర్డీఓలు, మండలాల వారిగా తహశీల్దార్లు సమావేశాలు నిర్వహించి అవసరమగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహాకులైన ఐకెపి, పిఎసిఎస్ సెంటర్లకు, ఎఇఓలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈసమావేశంలో జెసి హన్మంత్‌రావు, డిఎస్‌ఓ వేంకటేశ్వర్లు, డిఆర్‌డిఓ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.