మెదక్

బాలల చట్టాలపై ప్రచార రథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మార్చి 31: బాలల చట్టాలపై అవగాహన కల్పించేందుకు బాలల సంరక్షణ విభాగం, మెడ్వాన్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శుక్రవారం కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ కలెక్టరేట్‌లో ప్రారంభించారు. ఈ ప్రచార రథం ద్వారా జిల్లాలోని 100 గ్రామాల్లో పర్యటించి చట్టాలపై అవగాహాన కల్పించనున్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మోతి, బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ శివకుమారి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రత్నం, మెడ్వాన్ సంస్థ కార్యదర్శి మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు.

రూ.42 కోట్లతో మెదక్ రోడ్ల అభివృద్ధి

మెదక్, మార్చి 31: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా కేంద్రం మెదక్ పట్టణాన్ని ప్రకటించి మాట నిలుపుకున్నారని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇందిరాపురి కాలనీలో జరిగిన తెరాస సభ్యత్వ కార్యక్రమ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మెదక్‌ను జిల్లా కేంద్రం చేస్తామని ఓట్లు దండుకొని ఆ తరువాత జిల్లా కేంద్రం విషయంలో పట్టించుకోనివారిలో అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నుంచి ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులంతా ఉన్నారని ఆమె తెలిపారు. 42 కోట్లతో మెదక్ పట్టణం మొయిన్ రోడ్డును ఫోర్‌లైన్ రోడ్డుగా నిర్మించుకుంటున్నామని, జిల్లా కేంద్రంలోని రోడ్ల విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగా పెద్దబజార్ రోడ్డు వెడల్పు చెందాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లు విశాలంగా ఉంటే మెదక్ అంతా అందంగా కనిపిస్తుందన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం చాలా వరకు సాధించగలిగారని తెలిపారు. ఇందిరాపురి కాలనీలో జనరల్ కమ్యూనిటీ హాల్‌ను మంజూరు చేస్తున్నట్లు పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. మట్టి రోడ్లన్నీ సిసి రోడ్లుగా మార్చుతారన్నారు. కమ్యూనిటీ హాల్‌కు రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. యాసంగి పంటలకు ఘణపురం నుంచి నీళ్లు వదలడం వలన మంచినీటి సమస్య అంతగా లేదన్నారు. అయినప్పటికినీ మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. మిషన్ భగీరథ పనులలో భాగంగా మెదక్ పట్టణానికి 50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, అందుకు అవసరమైన పైప్ నిర్మాణాలు త్వరలో చేపట్టబోతున్నట్లు తెలిపారు. ముందుగా ఇందిరాపురి కాలనీలో మహిళలు పుష్పగుచ్చంతో ఉపసభాపతికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత ఇందిరాపురి కాలనీలోని మహిళలకు సభ్యత్వాలు అందజేశారు. పట్టణ అధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ మెదక్ పట్టణంలో గతంలో ఎనిమిది వేల సభ్యత్వాలు చేసినట్లు గుర్తు చేశారు. ఈ సంవత్సరం 10 వేల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు మాయ మల్లేశం, ఐతారం నర్సింలు, ఆర్‌కె.శ్రీనివాస్, ఇందిరాపురి కాలనీ అభివృద్ది కమిటి ప్రతినిధులు, మహిళలు రజిత, వాణి, కమల, దీప తదితరులు పాల్గొన్నారు.