మెదక్

మిగులు విద్యుత్ రాష్ట్ర ఘనత కెసిఆర్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 1 : విద్యుత్ రంగం రాజకీయాలను శాసించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. పవరే...పవర్‌ను మారుస్తుందని..తెస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో అదే జరిగిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఉన్నప్పుడే రాష్ట్రం సాకారమైతే విద్యుత్ సమస్య ఉత్పన్నమైతుందని ముందుగానే ఊహించిన కెసిఆర్ నాటినుంచే విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రణాళికను సిద్దం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్యుత్ ఇవ్వకుండా ఎన్నో కుట్రలు చేశారని, వాటన్నిటిని కెసిఆర్ సమర్థవంతంగా ఎదుర్కొని చతురతతో విద్యుత్ సమస్యను పూర్తిగా అధిగమించి నేడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 3.70కోట్లతో నిర్మించిన విద్యుత్ ఎస్‌ఇ కార్యాలయాన్ని మంత్రి హరీష్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తెలంగాణకు విద్యుత్ ప్లాంట్ ఇవ్వవద్దన్న ఉద్దేశంతో చంద్రబాబు కుట్రతో సీలేరుతో పాటు 7మండలాలను ఆంధ్రాలో విలీనం చేసుకున్నాడన్నారు. సిఎం కెసిఆర్ విద్యుత్ పై అవగాహన ఉండడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి ఖర్చుకు వెనుకాడకుండా విద్యుత్ కొనుగోలు చేసి వ్యవసాయానికి 6గం, పల్లెలు, పట్నాల్లో సైతం కోతలు లేకుండా అందించారన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి 9గం, 24గం. విద్యుత్ అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10వేల మెగావాట్ల డిమాండ్ పెరిగినా సరఫరాకు సిద్దంగా ఉన్నామన్నారు. రెండున్నరేండ్లలోనే కరంట్‌కోతల నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చారన్నారు. ప్రజల పై విద్యుత్ భారం వేయకుండా నిరంతర విద్యుత్ అందిస్తున్నామన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు సైతం రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ వస్తే అంధకారమైతుందని కలలుగన్న సీమాంధ్ర నేతల కండ్లు తెరిపించేలా తాము విద్యుత్ సరఫరాను పటిష్టపర్చినట్లు తెలిపారు. రాష్ట్రం వచ్చాక జరుగుతున్న అభివృద్ధి చూసి సీమాంధ్రనేతలు ఈర్షపడుతున్నారని, ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చర్చించుకుంటున్నారన్నారు. రాష్ట్రం వచ్చాక ప్రతి గ్రామంలో 5నుంచి 20కోట్ల వరకు వివిధ రకాల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రుణమాఫీ, మిషన్‌కాకతీయ, భగీరథ, రోడ్లు, వైద్యం, విద్య సదుపాయాలు చేపట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మొదటిస్థానంలో ఉందని, నంబర్‌వన్ సిఎంగా కెసిఆర్ గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రంలోని పేదల గుండెల్లోకి వెళ్లి ఆలోచించి సిఎం కెసిఆర్ వారి అభివృద్ధికి పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వం, కెసిఆర్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కోటి ఎకరాలకు నీరిచ్చే విధంగా సిఎం ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారన్నారు. కృష్ణ, గోదావరి నీటితో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. రక్షిత నీటి కోసం మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందిస్తున్నారన్నారు. ఏలాగైనా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఒక్కటై తప్పుడు ఫ్రచారం చేస్తున్నాయని, ప్రజలను బలిపశువులుగా మార్చేందుకు యత్నిస్తున్నారన్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్నారు. ఇంటింటికి నీరివ్వకుంటే ఓట్లడగమని కెసిఆర్ అనడంతో ఏలాగైనా అభివృద్ధిని అడ్డుతగులుతున్నారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కెసిఆర్ పట్టువీడకుండా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తారన్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన వారికి పరిహారం పెంచామన్నారు. గతంలో 50వేలు ఉండగా 4లక్షలకు పెంచామని, ఉద్యోగులకు 10లక్షలకు పెంచామని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సైతం అందిస్తున్నారన్నారు. వ్యవసాయ బావుల వద్ద రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లు ఏర్పాటు చేయవద్దని, ఆన్, ఆఫ్ స్టార్టర్లు వాడుకోవాలన్నారు. ఆటోమెటిక్ స్టార్టర్లతో విద్యుత్ దుర్వినియోగం అవుతుందన్నారు. అవసరమున్నంత వరకే విద్యుత్ వాడుకోవాలని, వృధా చేయవద్దని సూచించారు. అనంతరం విద్యుత్ ఉద్యోగులు మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీష్‌రావులకు జ్ఞాపికను అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఎండి రఘుమారెడ్డి, డైరక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట కలెక్టర్లు వెంకట్‌రాంరెడ్డి, సురేందర్, ఎస్‌ఇ సదాశివరెడ్డి, డిఇ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.