మెదక్

నెలాఖరులోపు సాదాబైనామా కేసులన్నీ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 4: సాదా బైనామా కేసులన్ని ఈ నెల 30లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జిల్లా అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయం నుండి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో పలు రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. వారసత్వంగా సంక్రమించే ఆస్తుల కసులు పది రోజుల్లో, మిగిలిన ఇతర కేసులను 15రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యుటేషన్ కేసులను పెండింగ్‌లో పెడితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఉన్న భూదాన్ భూములను ఆర్డీఓ, తహసీల్థార్లతో సమీక్షించి గుర్తించాలని, ఈ భూముల్లో ఇంటి స్థలాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. రైతాంగం రుణాలు కోసం చేసుకున్న దరఖాస్తులపై వెంటనే స్పందించి రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి తీవ్రంగా ఉన్నందున నీటి ఎద్దడి తలేత్తకుండా చూడాలని, ఓఆర్‌ఎస్ ప్యాకేట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా నుండి జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డిఆర్వో రఘురాంశర్మ, ఆర్డీఓలు శ్రీనివాస్‌రెడ్డి, హమీద్ తదితరులు పాల్గొన్నారు.