మెదక్

కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఏప్రిల్ 13: కేంద్ర ప్రభుత్వం వివిద పథకాల కింద మంజూరి చేస్తున్న నిధులను సిఎం కెసిఆర్ పక్కదారి పట్టిస్తూ సొంత డబ్బాకే పరిమితమైనట్లు బిజెపి రాష్ట్ర పరిశీలకులు, వైజాగ్ ఎంపి హరిబాబు విమర్శించారు. గురువారం రాత్రి గజ్వేల్‌లో మెదక్ పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అథిదిగా హాజరై ఆయన ప్రసంగించారు. యుపిఏ ప్రభుత్వ హయాం కుంబకోణాల మయం కాగా, అప్పటి గుజరాత్ సిఎం, ఇప్పటి ప్రధాని నరేంద్రమోడి దేశ ప్రజలకు ఆశాకిరణంగా కనిపించి బ్రహ్మరథం పట్టినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడి చేపడుతున్న వివిద సంక్షేమ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే నల్లదనం నియంత్రణ, ఉగ్రవాదుల చర్యలు అరికట్టడం, దొంగనోట్ల చలామణి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద నోట్ల రద్దు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోగా, ప్రతిపక్షాల ఆందోళనకు 50 రోజుల తర్వాత వచ్చిన చక్కటి ఫలితాలతో నోరు మెదప లేకపోయినట్లు ఆయన ఆరోపించారు. అలాగే ఈవిఎం లలో మోసాల ఫలితంగానే బిజెపికి అనుకూల విజయాలు వస్తున్నట్లు కాంగ్రెస్‌తోపాటు కమ్యూనిస్టులు, డిల్లీ సిఎం కెజ్రివాల్ చేస్తున్న రాద్దాంతం అర్థంలేనిదని, అయితే పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపొందిన విషయాన్ని ఏమంటారని నిలదీశారు. యుపి, ఉత్తరాఖండ్‌లలో మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సైతం బిజెపి అభ్యర్థులు విజయం సాదించగా, కుటుంబ పాలనకు ఇక చెల్లుచీటేనని ఉత్తరప్రదేశ్ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ విడిపోయి స్నేహబావంతో మెలగాలని కోరుకున్న తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోగా, అదిష్టానాన్ని మెప్పించి మద్దతు ప్రకటింపజేసిన విషయాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మర్చిపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జి ఆకుల రాజయ్య అధ్యక్షత వహించగా, కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిది రఘునందన్‌రావు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల బిజెపి అధ్యక్షులు నరోత్తంరెడ్డి, రాంచరన్‌యాదవ్, బుచ్చిరెడ్డి, మాజీ బిజెపి అధ్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు ఎల్లు రాంరెడ్డి, పేర్ల శ్రీనివాస్, గిరీష్‌రెడ్డి, వంగ రాంచంద్రారెడ్డి, విద్యాసాగర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసంక్షేమానికి పెద్దపీట
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
జహీరాబాద్, ఏప్రిల్ 13:ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్దపీఠ వేస్తుందని డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ఆడపిల్లలకు సిఎం.కెసిఆర్ కల్యాణలక్ష్మి, శాదీముబారక్‌లతో వారిని ఆదుకుంటున్నారని అన్నారు. గురువారం పలు అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకోసం ఆమె జహీరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కుప్పానగర్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్, అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ ఎక్స్‌అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే ఫరీదుద్ధీన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అమె పాల్గొన్నారు. అదేవిధంగా శేకాపూర్‌లోని ఘేరుఖాన్ చెరువులో 3వ విడత మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఏషియన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులకు చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా సాదాబైనామా దృవపత్రాల లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ పథకంలో ఆడపిల్లలు లబ్దిపొందుతున్నారన్నారు. మేనమాన కానుకగా కేసిఆర్ ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. ఆడ పిల్లల వివాహ సమయంలో తల్లిదండ్రులకు ఇదోమద్దతులా ఉంటుందన్నారు. అదేవిధంగా అర్హులైన వారికి సాదాబైనామ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ జె.గీతారెడ్డి మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఆడపిల్లను ఆదుకునేందుకు బంగారు తల్లి సంక్షేమ పథకం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేదలకు అభయాస్తం కార్యక్రమం ఎంతగానో మేలు చేకూర్చిందన్నారు. ఇలాంటి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఎంపి బిబి.పాటిల్, ఎమ్మెల్సీ ఎండి.్ఫరీదుద్ధీన్‌లు మాట్లాడుతూ పేదల సంక్షేమంతోపాటు రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసిన ఘనత కెసిఆర్‌కె దక్కుతుందన్నారు. అదేవిదంగా కులంసంఘాలకు అనేక రకాలుగా ప్రభుత్వం ప్రోత్ససిస్తోందసన్నారు. పత్స్యకారులు, గొల్లకొర్మల సంక్షేమంకోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన లబ్దిదారులు పాల్గొన్నారు.
జలసంరక్షకు ప్రభుత్వం కృషి
వర్షపునీటి సంరక్షణకోసం ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టిందని డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని శేకాపూర్‌లోని ఘేరూఖాన్ చెరువులో 3వ విడత మిషన్ భగీరథ పనులను ఆమె ప్రారంభించారు. జెసిబిని నడిపి పూడిక తీత పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఘేరూఖాన్ చెరువులో 3వ విడత మిషన్ భగీరథ పనులు నిర్వహించేందుకోసం రూ.91లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 3వ విడతలో చేపట్టిన ఈ పనులు సక్రమంగా నిర్వహిస్తే ఆయకట్టు పెరుగుతుందన్నారు. సంమృద్ధిగా పంటలు పండి రైతులు ఆనందంగా ఉంటారన్నారు. ప్రతి వర్షపునీటి బొట్టును ఒడిసి పట్టే సంకల్పంతో అనేక కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పార్లమెంట్ సభ్యులు బిబి.పాటిల్, ఎమ్మెల్యే గీతారెడ్డి, ఎమ్మల్సీ ఎండి.్ఫరీదుద్దీన్, జెసి వాసం వెంకటేశ్వర్లు, ఎంపిపి.చిరంజీవిప్రసాద్, జడ్పిటిసి సభ్యుడు కిషన్‌పవార్, మార్కెట్ కమిటి చైర్మన్ డి.లక్ష్మారెడ్డి ఇతర ప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.