మెదక్

సంక్షేమ పథకాలకు అడ్డుతగులుతున్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, ఏప్రిల్ 15: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీ అడ్డుతగులుతుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం రామాయంపేటకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు పెట్టుబడి భారం కాకుండా చూడాలనే మంచి లక్ష్యంతో ముఖ్యమంత్రి రైతులకు ఎకరా పొలానికి రూ.4వేలు ఎరువుల కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించడం ఆయన మంచి తనానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికే ఎస్‌సి, ఎస్‌టి రైతులకు వందశాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, బిసి రైతులకు 95శాతం సబ్సిడీతో డ్రిప్‌ను అందజేస్తున్నట్లు వివరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తిచేసి సాగుకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కులవృత్తులకు ఆర్థిక పరిపుష్టత కల్పించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడం జరిగిందన్నారు. దేశం మొత్తం తెలంగాణ పథకాలను అనుసరించే ఏర్పాట్లు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేయకుండా అభివృద్ధికి సలహాలు ఇస్తే బాగుంటుందని సూచించారు. సద్విమర్శలు చేస్తే స్వాగతిస్తాం..విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. రామాయంపేట పట్టణంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని ఉపసభాపతి తెలిపారు. నందిగామ గ్రామానికి చెందిన వదుకు కుటుంబానికి కల్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. ఈసమావేశంలో ఎంపిపి పుట్టి విజయలక్ష్మీ యాదగిరి, ఆత్మకమిటీ చైర్మెన్ రమేష్‌రెడ్డి, పుట్టి యాదగిరి, బాజ చంద్రం, నాగేశ్వర్‌రెడ్డి, బాజ సిద్దరాములు, సుధాకర్‌రెడ్డి, దేమె యాదగిరి, గడ్డి శ్యాంసుందర్, కొత్త శ్రీనివాస్, సంగు స్వామి, ఆకుల మహేష్, తిర్మల్‌గౌడ్, తహశీల్దార్ ఆనందరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
పంట నష్టపరిహారం అడగడం తప్పా..!

రామాయంపేట, ఏప్రిల్ 15: రామాయంపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చేసిన పాదయాత్రను తెరాస నాయకులు తప్పుబట్టడం సరికాదని ఉమ్మడి జిల్లాల సేవాదల్ అధ్యక్షుడు అమరసేనారెడ్డి అన్నారు. శనివారం రామాయంపేటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులపై తెరాస నేత దేవేందర్‌రెడ్డి చేసిన విమర్శలను వారు ఖండించారు. గత కాంగ్రేస్ పాలనలో తెరాస కూడా బాగస్వాములనే విషయం వారు మరిచిపోవడం బాధాకరం అన్నారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి నియోజకవర్గం రద్దయితుందని తెలిసి పోరాడి దక్కించుకోలేదా..మరి మీరెందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజిటుపిజి ఉచిత విద్య, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని దీనికి తాము బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామని ప్రతిసవాలు చేశారు. ఈసమావేశంలో మాజీ మార్కెట్ కమిటి వైస్ చైర్మెన్ హైమద్, రొయ్యల పోచయ్య, లాలాగౌడ్, సాల్మన్‌రాజు, శివ, గౌస్, అర్షద్, సంపత్, సిద్దరాములు, వెంకటి, గొల్ల రమేష్‌తో పాటు పలువురు ఉన్నారు.