మెదక్

ఇంటర్ ఫలితాల్లో ముదితలే ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 16: చదువుల్లో తమకు బాలురు ఎట్టి పరిస్థితుల్లో పోటీరారని బాలికలు మరోమారు తమ సత్తాను చాటి చెప్పారు. 2016-17 వార్షిక పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలను సాధించి వారిలోని పట్టుదలను నిలబెట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. మూడు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ కళాశాలలో చూసినా బాలికలే అధిక సంఖ్యలో ఉత్తీర్ణులు కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 19వ స్థానాన్ని నిలబెట్టుకోగా, మెదక్ 24వ స్థానంతో సరిపెట్టుకుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వచ్చిన ఫలితాలతో పోలిస్తే సిద్దిపేట మరికొంత ముందు వరుసలో నిలువడం విశేషం. ప్రథమ సంవత్సరంలో 18వ స్థానంలో నిలువగా, ద్వితీయ సంవత్సరంలో 20వ స్థానంలో నిలువడం గమనార్హం. సంగారెడ్డి జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 19వ స్థానంలో ఉండటంతో సిద్దిపేట సరసనే నిలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ప్రథమ సంవత్సరంలో బాలురు, బాలికలు కలిసి మొత్తం 1514 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వీరిలో 6039 మంది 48 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. బాలురు 6235కుగాను 2849 మంది 46 శాతంతో ఉత్తీర్ణత సాధించగా బాలికల్లో 6279కి 3190 మంది 51 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 10779 మంది పరీక్షలకు హాజరుకాగా 6165 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 5343 మందిలో 2978 మంది 56 శాతంతో ఉత్తీర్ణులుగా నిలిచారు. బాలికల్లో 5436కుగాను 3187 మంది 59 శాతంతో ఉత్తీర్ణులై ఉన్నత చదువులకు వెళ్లనున్నారు. ఒకేషనల్‌లో ప్రథమ సంవత్సరం 718 మందికిగాను 393 మంది 55 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవ్సరంలో 553 మందికి 410 మంది 74 శాతంతో ఉత్తీర్ణులుగా నిలిచారు. ఒకేషనల్‌లో ప్రథమ సంవత్సరంలో రాష్ట్రంలో 13వ స్థానం సాధించగా ద్వితీయ సంవత్సరంలో 6వ స్థానానికి అతిక్రమించడం విశేషం. మొత్తంమీద ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా పరవాలేదనిపించుకుంది.