మెదక్

పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ పాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంగునూరు, ఏప్రిల్ 20: మండల పరిధిలోని పాలమాకులలో పురావాస్తుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తవ్వకాల్లో గరువారం పలు రకాల పాత్రలు వెలికితీశారు. 3,4,5 సమాదులలో తవ్వకాలు చేపట్టగా ఒక్కొ సమాది ఉపరితల ఫైభాగం నుండి 1.2మీటర్ నుండి 1.4 మీటర్ తవ్వకాలు జరుపగా ఇందులో పలు రకాల పాత్రలు వెలికితీయడం జరిగిందని పురావాస్తుశాఖ అసిస్టెండ్ డైరెక్టర్లు సాగర్, నాగరాజు తెలిపారు. 3వ సమాది సిస్ట్భుగంలో సన్నం మరియు ఎరుపు రంగు పాత్రలు పెర్చి ఉండడంతో అందునుండి వాటిని వెలికితీయడం జరిగిందన్నారు. 4,5 సమాదుల్లో డిప్‌బౌల్, మినేచర్‌బౌల్‌లతో పాటు కుండను వెలికితీయడం జరిగిందన్నారు. మృణ్‌మయ పాత్రలు మానవుని ఎముకలు సైతం బయటికి తీయడం జరిగిందన్నారు. వీటిల్లో లభించిన పాత్రలు, ఎముకలను భద్రపరిచి సిసిఎండి పరిశోధన సంస్థకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ తవ్వకాలు మరిన్ని రోజలు జరుగుతాయని వారు తెలిపారు. ఈ తవ్వకాల్లో సాంకేతిక సిబ్బంది గంగాదేవి, మాదవి, సైదులు, బానుమూర్తులు ఉన్నారు.

సిద్దిపేటలో 12, దుబ్బాకలో 2
పోలీంగ్ కేంద్రాలు మార్పునకు ఆమోదం
కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
సిద్దిపేట, ఏప్రిల్ 20 : ఓటర్ల జాబితాలో సవరణలో భాగంగా సిద్దిపేట నియోజక వర్గంలోని 12 పోలీంగ్ కేంద్రాలు మార్పు, దుబ్బాక నియోజక వర్గంలో రెండు పోలీంగ్ కేంద్రాల మార్పునకు ప్రతిపాదనలు ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని సిద్దిపేట నియోజక వర్గంల 12 పోలీంగ్ స్టేషన్ కేంద్రాలు ఉన్న భవనాలు నిర్మాణంలో ఉండటం, వేరే కార్యాలయాలు పనిచేయటం కారణంగా ప్రాంతాల్లో లోకేషన్ మార్పు చేసినట్లు తెలిపారు. అలాగే దుబ్బాక నియోజక వర్గంలో రెండు పోలీంగ్ స్టేషన్లు ఉన్న పాఠశాలల పేరు మార్పు కారణంగా పేరు మార్పులకు ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. ఈసమావేశంలో జెసి పద్మాకర్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, టిడిపి నేతలు ధరిపల్లి చంద్రం, సిపిఎం నేత రేవంత్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభాకర్‌వర్మ, సిపిఐ నుండి పవన్ కుమార్, టిఆర్‌ఎస్ నుండి పాల సాయిరాం పాల్గొన్నారు.

రింగ్‌రోడ్డు నిర్మాణానికి రైతులు సహకరించాలి

గజ్వేల్, ఏప్రిల్ 20: గజ్వేల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి నిర్వాసిత రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి కోరారు. గురువారం సాయంత్రం ఆర్డీఓ కార్యాలయంలో బాదిత రైతులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా, నియోజకవర్గం అందులో ముందున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా సిఎం కెసిఆర్ రింగ్‌రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తుండగా, రైతులకు నష్టం జరగనివ్వకుండా ఆదుకుంటామని తెలిపారు. రైతులు సమాజ శ్రేయస్సు కోసం సహకరించాలని, అదైర్య పడకుండా తమకు సహకరిస్తే న్యాయం చేస్తామని బరోసా ఇచ్చారు. అనంతరం గజ్వేల్ ఎడ్యుకేషన్‌హబ్‌ను ఆయన పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బాలికలకు సంబందించిన అంశాల్లో అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెసి పద్మాకర్, ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాల ప్రతీ నెల సమీక్ష
తూప్రాన్, ఏప్రిల్ 20: ప్రభుత్వ పథకాలను వేగవంతంగా అమలు చేయడానికి ప్రతి నెల డివిజన్ స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ భారతిహొలికెరి పేర్కొన్నారు. తూప్రాన్ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవికాలంలో తాగునీటి సమస్య ఏర్పడే అవకాశముందని, తాగునీటి సమస్య ఏర్పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలు వేగవంతం చేయడానికి యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.