మెదక్

రైతు సమస్యల పరిష్కారంలో సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 20 : రైతుసమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎండిపోయిన పంటలకు సర్వే చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు చేతి కొచ్చిన పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. పాలకులు రైతు సమస్యలను పరిష్కరించుకోకుండ ప్లీనరీ సమావేశాల కోసం తలమునకలపై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నరని దుయ్యపట్టారు. ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు యత్నిస్తున్నారన్నారు. ఇటువంటి ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాధించలేదన్నారు. ఎన్నికల ముదు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించ బూటకపు ప్రకటనలతో బంగారు తెలంగాణ చెప్పి విస్మరించారన్నారు. సిఎం మాటలన్ని నీటి మూటలుగా మిగిలాయని దుయ్యపట్టారు. సిఎం సొంత జిల్లాలో అభివృద్ధి పేరిట పెద్దఎత్తున అవినీతి జరుగుతుందని విమర్శించారు. కరువుతో పంటలు ఎండిపోయిన రైతాంగాన్ని, వడగండ్ల వానతో దెబ్బతిన్న రైతులను ఆదుకునేవరకు సిపిఐ పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వడగండ్లతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సిద్దిపేట జిల్లాలో వడగండ్లతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ అన్నారు. రైతులను ఆదుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులను ఆదుకోవటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. జిల్లా అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయి పర్యటన చేసి సర్వే చేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. రైతు సమస్యల పరిష్కారం చేసే పోరాటంతో తమవంతు సహాకారం అందిస్తామన్నారు. సిపిఐ సీనియర్ నేత మోహినోద్దీన్, టిడిపి బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి దరిపల్లి చంద్రంలు సంఘీభావం ప్రకటించారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మందపవన్, బాలమల్లు, మచ్చ శ్రీనివాస్, సురేందర్‌రెడ్డి, ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కాలంచెల్లిన మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
* డ్రగ్ ఇన్స్‌పెక్టర్ల దాడి * వ్యాక్సిన్‌లు స్వాధీనం * ముగ్గురిపై కేసు నమోదు
రామాయంపేట, ఏప్రిల్ 20: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గొల్లకుర్మలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ముఖ్యమంత్రి ఓపక్క కృషి చేస్తుంటే మరోపక్క అదికారుల నిర్లక్ష్యం మూలంగా పథకం పక్కదారి పడుతుంది. వెటర్నరీ అధికారులు గొర్రెలకు ఉచితంగా పంపిణీ చేసే మందులను కొందరు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. దుఖాణాదారులు ఏకంగా కాలంచెల్లిన (ఎక్స్‌పైర్) అయిన ప్రభుత్వ మందులను విక్రయిస్తూ గొల్లకుర్మలను నిలువునా మోసం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఓ దుఖాణాదారుడు వెటర్నరీ అధికారుల నుండి మందులను తీసుకొని కాలంచెల్లిన తర్వాత కొంతమందిని ముఠాగా తయారుచేసి క్షేత్రస్థాయిలో గ్రామాల్లోకి వెళ్లి గొల్లకుర్మలకు ఒక్కో వ్యాక్సిన్ ఐదు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు. గురువారం రామాయంపేట మండలంలోని ఆర్.వెంకటాపూర్‌లో రమేష్, గణేష్, భూపతిరెడ్డి అనే ముగ్గురు సభ్యుల ముఠా ప్రభుత్వ మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు శ్రీలత, ప్రసాద్, ఉపేందర్‌లు దాడులుచేసి వారిని పట్టుకున్నారు. వారివద్ద నుండి 56వ్యాక్సిన్ బాటిళ్లు, ఓటివిఎస్ వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ అధికారి రాజవర్దన్‌చారి ఘటనా స్థలికి చేరుకొని పంచనామ నిర్వహించి ముగ్గురిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అమాయకులైన గొల్లకుర్మలను మోసం చేస్తూ నష్టాలకు గురిచేస్తున్న ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.