మెదక్

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్,ఏప్రిల్ 27: మారుతున్న టెక్నాలజిని ఉపయోగించుకొంటూ ప్రజలకు జవాబిదారిగా వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు విఆర్‌ఓలకు సూచించారు. గురువారంనాడు నర్సాపూర్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి విఆర్‌ఓల శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన ఆర్డీఓ వెంకటేశ్వర్లుతో కలిసి మాట్లాడుతూ రోజు రోజుకు మారుతున్న టెక్నాలజి ప్రకారం మనం మారాలని అన్నారు. విఆర్‌ఓలకు అందిస్తున్న ట్యాబ్‌ల వల్ల పనులు సులభతరం కానున్నాయని అన్నారు. 15రోజులలోగా గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం ట్యాబ్‌లలో నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు భూములకు సంబంధించిన పూర్తి డాటా కలెక్ట్ చేయాలని అన్నారు. కల్యాణలక్ష్మీ, షాధిముబారక్ దరఖాస్తులను వెంట వెంటనే పూర్తి చేసి పెళ్లికి ముందే చెక్కుల పంపిణీ జరిగేటట్లు చూడాలని అన్నారు. పట్టేదారు మరణిస్తే 10రోజుల్లో ముటేషన్ చేసి వారసులకు అందించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రజలకు ప్రవేశపెడ్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన డాటాను సిద్ధం చేసుకోవాలని విఆర్‌ఓల వద్ధ గ్రామానికి చెందిన మ్యాప్‌లు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇప్పటివరకు మ్యాపులు లేకుండా ఏలా పని చేశారని నిలదీశారు. విధుల పట్ల అలక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

నేడు పిసిసి అధ్యక్షుడి రాక
* డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డి
నర్సాపూర్, ఏప్రిల్ 27: నర్సాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎండిన వరి పంటలను పరిశీలించడానికి శుక్రవారంనాడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వస్తున్నట్లు డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి తెలిపారు. గురువారంనాడు నర్సాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమే విలేఖరులతో మాట్లాడుతూ నర్సాపూర్ మండలంలోని తుజాల్‌పూర్, తిర్మాలాపూర్, మంతూర్, రెడ్డిపల్లి గ్రామాల్లో ఎండిపోయిన వరిపంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారని అన్నారు. అనంతరం రెడ్డిపల్లి వద్ధ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమాలకు పెద్ధ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, నర్సాపూర్ సర్పంచ్ వెంకటరమణారావు, మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా, మాజీ ఎంపిపి లలిత, నాయకులు జీవన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాజేష్, భరత్‌గౌడ్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.