మెదక్

వివాహ చట్టం అన్నివర్గాలకు వర్తిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఏప్రిల్ 27: సమాజంలో అన్ని కులాలు, మతాలు, వర్గాలలో వివాహ చట్టాన్ని ప్రజల్లో అవగాహణ కల్పించాలని జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో మహిళా శిశు వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శులు, సబ్ రిజిస్టార్‌లకు నిర్వహించిన అవగాహణ సదస్సులో వివాహ నమోదు చట్టంపై కలెక్టర్ భారతి హొళ్లికేరి మాట్లాడారు. 2002లో రాష్ట్ర ప్రభుత్వం వివాహానికి చట్టబద్దత కల్పించడానికి ఒక ప్రత్యేక చట్టం తెచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ చట్టం ద్వారా బాల్య వివాహాలను అరికట్టవచ్చని, రెండవ వివాహం అడ్డుకోవచ్చని, రహస్య పెళ్లిలు వంటివి అరికట్టవచ్చని ఆమె తెలిపారు. వివాహాన్ని రిజిస్టార్ చేయించుకొని ఇతరులకు అవగాహణ కల్పించాలని ఆమె తెలిపారు. పంచాయితీ కార్యదర్శులు, వారి వారి గ్రామాల్లో జరిగిన వివాహాలను తప్పనిసరిగా రిజిస్టార్ చేయించాలన్నారు. వివాహం జరిగిన సంవత్సరం తరువాత అయితే సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు. మే 10లోగా గ్రామాల్లో ఎన్ని వివాహాలను రిజిస్టార్ చేశారు అనే నివేదికను సమర్పించాలన్నారు. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బంగారు తెలంగాణ దిశగా మార్పు తీసుకురావాలని ఆమె తెలిపారు. వివాహ నమోదు అధికారి గ్రామ స్థాయిలో పంచాయితీ కార్యదర్శి తప్పనిసరి ఈ చట్టంపై అవగాహణ కల్పించాలని ఆమె ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ మాట్లాడుతూ వివాహ చట్ట ప్రకారం వివాహన్ని నమోదు చేసుకోవాలన్నారు. అట్టి వివాహం చేసుకున్న 20 రోజుల్లోగా సమీపంలోని రిజిస్టార్ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయంలో, పంచాయితీ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ వివాహాన్ని ముందుగా పంచాయితీ కార్యదర్శిని సంప్రదించాలని కోరారు. ఆర్డీఓ మెంచు నగేష్ మాట్లాడుతూ ఆడ పిల్లపై జరిగే చిన్న చూపుపై కూడా ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. రెండవ వివాహాలు జరగడానికి అవకాశం లేకుండా ఉంటుందని తెలిపారు. బాలల సంక్షేమ సమితి చైర్మన్ శివకుమారి మాట్లాడుతూ తప్పనిసరి వివాహ నమోదు చట్టం 2002 ద్వారా బాల్య వివాహాలను అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ, ఆర్డీఓ మెంచు నగేష్, సిడబ్ల్యూసి చైర్మన్ శివకుమారి, సబ్ రిజిస్టార్లు, బాలల సంక్షేమ అధికారి రామకృష్ణ, సిబ్బంది విఠల్, గోపాల్, సిడిపిఓలు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రతి నల్లాకు ప్రోకంట్రోల్ వాల్వ్‌లు
తూప్రాన్: మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన నల్లాల నుండి తాగునీరు వృధా కాకుండా ప్రతీ నల్లా కనెక్షన్‌కు ప్రోకంట్రోల్ వాల్వ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి పేర్కొన్నారు. తూప్రాన్‌లో డివిజన్ స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. గ్రామాలలోని నల్లా కనెక్షన్‌లన్నీ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తాయని ఎవరైనా ప్రోకంట్రోల్ వాల్వ్‌లను తొలగిస్తే పంచాయతీవారు వారికి ఫైన్ వేస్తారని చెప్పారు. వీటిని వృధా కాకుండా ప్రతి ఒక్కరు పొదుపుగా వాడుకోవాలని నీటిని మురికి కాలువలలో వదిలివేయొద్దని కోరారు. జిల్లాలో తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ఇంటింటికీ నల్లాకనెక్షన్‌లు పూర్తయ్యాయని, ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలుంటే మేగా కాంట్రాక్టర్ సిబ్బంది సరిచేయనున్నట్లు చెప్పారు. దుబ్బాక, నార్సింగ్, చేగుంట మండలాల్లో 50 శాతం పనులయ్యాయని మరో 55 హాబిటేషన్ గ్రామాలలో మే 1 నుండి పనులు ప్రారంభమవుతాయని ఆమె చెప్పారు.