మెదక్

సర్కారు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, ఏప్రిల్ 28: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక నియోజకవర్గంలోని ధర్మాజీపేట, మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామాల్లో ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కొనుగోళ్ల వివరాలన్ని పుస్తకాల్లో కాకుండా ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో నమోదు చేయాలని సూచిస్తు ఏకెపి నిర్వాహకులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్యాబ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు దళారుకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దన్నారు. రైతులకు మద్దతు ధర అందించడం కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పల్లెల్లో ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
దసరా పండుగ లక్ష్యంగా డబుల్ ఇళ్ల నిర్మాణాలు
పేదొడి ఇంటి కలను సాకారం చేసే దిశగా సిఎం కెసిఆర్ డబుల్ బెడ్‌రూం ఇంళ్ల నిర్మాణాలు చేపట్టడంలో గట్టి సంకల్పంతో ఉన్నారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. దుబ్బాక నగర పంచాయితీ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల పనులను శుక్రవారం కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి సారధ్యంలో మంచి టీమ్‌తో నిర్మాణ పనులన్ని వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు. సిఎం కెసిఆర్ లక్ష్యాలకు అనుగుణంగా అందరి సహకారంతో దసరా పండుగ నాటికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ అరుణ, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గంజాయి సాగు కేసుల్లో ఏడుగురు పాత నేరస్థుల అరెస్ట్
నారాయణఖేడ్ ఏప్రిల్ 28: మనూరు మండలం ఎనక్‌పల్లి గ్రామ పంచాయతీలోని రత్ననాయక్ తండాకు చెందిన ప్రేమ్‌సింగ్, చందర్‌నాయక్, హరిదాస్ నాయక్, కాళ్లు నాయక్, పూండ్లిక్, రాధోడ్ కిషన్‌లు గత 2001,2లో వారి భూముల్లో గంజాయి పంటను సాగు చేస్తూ ఎక్సైయిజ్ అధికారులకు పట్టుబడ్డారు. అప్పట్లో వారిపై కేసులు నమోదు చేసినా వారు తప్పిచుకుని తిరగుతున్నారని గురువారంనాడు సాయంత్రం తండాలపై దాడులు చేసి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, గంగాధర్‌లు విలేఖరులకు శుక్రవారంనాడు తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 300మంది రైతులు గంజాయి సాగు చేస్తూ ఎక్సైయిజ్ అధికారులకు పట్టుబడిన వారిలో ఉన్నారని అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ స్పెషల్‌పార్టీ డిఎస్పీ సైదులు ఆధ్వర్యంలో దాడులను కొనసాగిస్తున్నారు. పాత నిందితులను అరెస్ట్ చేస్తూ కోర్టుకు రిమాండ్ చేస్తునట్లు వారు తెలిపారు. ఏడుగురు నిందితులను శుక్రవారంనాడు కోర్టుకు రిమాండ్ పంపించినట్లు అయన తెలిపారు. ఇందులో సిఐలు మాణ్యం, మురళి, సూర్యప్రకాష్‌లు సిబ్బంది తదితరులున్నారు.