మెదక్

పార్టీకతీతంగా పథకాల లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌడిపల్లి, ఏప్రిల్ 28. పార్టీలకతీతంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లిలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఇండ్లు కూలిపోయిన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పార్టీలకతీతంగా అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తుందని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకుడదనే ఉద్దేశంతో వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఓక్కొక్కరికి రూ. 51వేలు చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను రూ. 75వేల 116లకు పెంచి నిరుపేద కుటుంబాలకు అందజేస్తారని మదన్‌రెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేసి తీరుతుందని పేర్కొన్నారు. వర్షాకాలం, యాసంగి పంటలకు వేర్వేరుగా ఎకరంకు 4 వేల రుపాయలను ఎరువుల కోసం రైతుల ఖాతాలో డబ్బులు జమచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకంను ప్రవేశపెట్టిన ఘనత కెసిఆర్‌కు దక్కిందన్నారు. గత సంవత్సరం అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు పాక్షికంగా కూలిపోయిన ఇండ్లకు రూ.3200 చెక్కుల రూపంలో లబ్దిదారులకు అందజేస్తామని మదన్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోనే కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద 4 కోట్ల రుపాయలను పంపిణీ చేయడం జరింగిందని తెలిపారు. కౌడిపల్లి, చిలప్‌చెడ్ మండలాల్లో 567 ఇండ్లు వర్షాలకు పాక్షికంగా కూలిపోయాయని ఓక్కొక్కరి రూ. 3200లు చెక్కుల రూపంలో పంపిణీ చేస్తున్నామని, అలాగే రెండు మండలాల్లో 66 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీకి సిద్ధం చేయడం జరిగందన్నారు. ఈ కార్యాక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు యాదమ్మరామగౌడ్, ఎంపిపి అధ్యక్షురాలు పద్మనర్సింహ్మారెడ్డి, ఉపాధ్యాక్షులు సున్నం సతీష్, మండల పార్టీ అధ్యక్షులు శివాంజనేయులు, తహశీల్దార్లు శ్రీశైలం, షాదత్, ఎంపిడిఓ సత్యనారాయణ, నాయకులు నర్సింహ్మారెడ్డి, రామాగౌడ్, నరహరి, శంకర్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, పాష, ధర్మారెడ్డి, శెట్టయ్య, అంజయ్య, మోతీలాల్‌గౌడ్, దర్జిచెంద్రం, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, లబ్దిదారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనాలంటూ
రైతుల ధర్నా
శివ్వంపేట, ఏప్రిల్ 28: రెండు రోజుల నుండి వరి ధాన్యం తెచ్చిన ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ శివ్వంపేట, గూడూర్ గ్రామానికి చెందిన రైతులు మండల కేంద్రం సహకార సంఘం ప్రధాన రహదారిపై శుక్రవారం రెండు గంటల పాటు ధర్నా, రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన రైతుల నుండి ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ప్రభుత్వమని చెబుతూ రైతులను మోసం చేయడం ఏమిటని రైతులు నిజాం యాసిన్, నాగేశ్, అశోక్, బొట్టు శ్రీనివాస్, బాలేష్, శంకర్, లక్ష్మీనారాయణ, బాలయ్యలు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ధర్నా విరమించమని పట్టుపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు వచ్చేంత వరకు కదలమంటూ పట్టుపట్టడంతో స్థానిక ఎఎస్సై మాణయ్య, హెడ్‌కానిస్టేబుల్ వీరయ్యలు రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.