మెదక్

ఎండిన పంటకు సత్వర పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్,ఏప్రిల్ 28: ఎండిన వరి పంటలకు ఎకరాకు పది వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి వాకిటి సునీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారంనాడు ఉదయం ఏడు గంటలకు నర్సాపూర్ మండలంలోని తుజాల్‌పూర్ గ్రామం నుంచి ప్రారంభించిన పాదయాత్ర 8కిలో మీటర్ల వరకు సాగింది. మద్య మద్యన రైతుల పొలాల్లోకి వెళ్లి ఎండిన వరి పంటలను పరిశీలించారు. పెద్ధ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా దారిపొడుగున ఉన్న పంట పొలాలను కలియదిరిగారు. తుజాల్‌పూర్, తిర్మాలాపూర్, మంతూర్, రెడ్డిపల్లి గ్రామ శివారులో గల వరి పంటలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎండిన ప్రతి ఎకరాకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో వర్షాలు కురియకపోవడంతో రబీ సీజన్‌లో బోరుబావుల వద్ధ రైతులు వరి పంటలు వేసుకున్నారు. అవి కూడ భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఎండిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పంటలు ఎండిపోయి అప్పుల పాలైన రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పంటలు ఎండిపోయి ఒక వైపు రైతు డీలాపడిపోగా మరో వైపు కొద్దిపాటి పండిన వరి దాన్యాన్ని అమ్ముకుందామని కొనుగొలు కేంద్రానికి వెళ్తే అక్కడ రోజుల తరబడి వేచి ఉంచడం రైతుల పాలిటశాపంగా తయారైందని ఆరోపించారు. నాలుగు విడతల రుణమాఫీ వల్ల రైతులకు ఒరిగింది ఏమి లేదని వడ్డీకి మాత్రమే అవి సరిపోయాయని పలువురు రైతులు చెప్పడం జరిగిందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను అష్టకష్టాలపాలు చేస్తున్నారని ఆరోపించారు. వరిలోని పొల్లును వేరు చేసే యంత్రాలు సరిపోను లేకపోవడం వల్ల రైతులు మూడు, నాలుగు రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అంతేగాకుండ హమాలిల కూలి పేరిట 25రూపాయలు వసూలు చేస్తున్నారని రెండు సంచికి రెండు కిలోలు కటాఫ్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఇబ్బందులను తొలగించాలని లేని పక్షంలో పెద్ధ ఎత్తున రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. పాదయాత్రలో కొల్చారం జడ్పీటిసి శ్రీనివాస్‌రెడ్డి, ఎడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ ప్లోర్ లీడర్ ప్రభాకర్, మాజీ ఎంపిపి లలిత, యువజన నాయకుడు సంతోష్‌రెడ్డి, స్థానిక నాయకులు వెంకటరమణారావు, ఆంజనేయులుగౌడ్, సత్యంగౌడ్, శ్రీనివాస్‌గుప్తా, దుర్గారెడ్డి, విఠల్, నర్సింలు, రాజేష్, సత్యంగౌడ్, లలిత, ప్రభాకర్, మాణిక్యరెడ్డి, శ్రీ శైలంయాదవ్, చందన్‌రెడ్డి, భరత్‌గౌడ్, శ్రీపతి, సుధాకర్‌రెడ్డి, మహమ్మద్, రషీద్, ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.