మెదక్

అవినీతి, అక్రమ రాజకీయాలకు కేరాఫ్ జగ్గారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 10: అవినీతి, అక్రమ రాజకీయాలకు కేరఫ్ అడ్రసైన జగ్గారెడ్డి మంత్రి హరీష్‌రావు కాలి గోటికి కూడా సరిపోడని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు. అభివృద్ధికి సహకరించకపోయిన పర్వాలేదు కాని తప్పుడు కూతలు మానుకోవాలని హితువు పలికారు. ఆదివారం సంగారెడ్డి ఐబి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవ్వరిని భయబ్రాంతులకు గురి చేసి పార్టీలోకి చేర్చుకోలేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్న విషయాన్ని గ్రహించాలన్నారు. రాజకీయ ప్రస్థానం మొదలైంది టిఆర్‌ఎస్ పార్టీతోనేని, అన్నం పెట్టిన పార్టీకే కన్నం పెట్టిన చరిత్ర జగ్గారెడ్డిదని విమర్శించారు. భయభాంత్రులకు గురి చేస్తేనే నువ్వు పార్టీలు మారావా అని ప్రశ్నించారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం పూటకో మాట, పార్టీలు మారే చరిత్ర జగ్గారెడ్డిదన్నారు. మంత్రి హరీష్‌రావు గురించి మాట్లాడే స్థాయి నీది కాదని, స్థాయిని మించి మాట్లాడకపోతే మంచిందని, గొప్పలు మాట్లాడితే గొప్పవారైపోరన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే రాజకీయ సన్యాసమన్నావు, లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందకపోతే నియోజకవర్గ ప్రజలకే కనిపించనన్న మాటలేమయ్యాయని ప్రశ్నించారు. 2019లో కూడా ఓటమి చవి చూడక తప్పదని, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని భూ స్థాపితం చేయడం ఖాయమన్నారు. జిల్లాకేంద్రమైన సంగారెడ్డి పట్టణాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాకేంద్రంలో పర్యటించి అవసరమైన నిధులు కేటాయిస్తారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లని, ఎళ్లవేలల వారికి అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేందుకే 8మంది కౌన్సిలర్లతో కలిసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరామన్నారు.ప్రలోభాలకు లొంగి పార్టీలో చేరలేదన్నారు. వైస్ చైర్మన్ గోవర్ధన్‌నాయక్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాటలన్ని అవస్తావమని, ప్రజల ఆకాంక్ష, అభివృద్ధి కోసం స్వచ్చందంగా తామే పార్టీలో చేరామన్నారు. సమావేశంలో టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు విజయేందర్‌రెడ్డి, డాక్టర్ శ్రీహరి, జలాలోద్దీన్‌బాబా, రాంకిషన్, టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రదీప్, ఉదయ్‌కిరణ్, మురళీధర్, నాయకులు శ్రీకాంత్, రాజేందర్‌నాయక్, శ్రవణ్‌రెడ్డి పాల్గొన్నారు.