మెదక్

గొర్రెల పెంపకం దారుల ఎంపికలో పారదర్శకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 10: గొర్రెల అభివృద్ధి పథకంలో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని ఎలాంటి పొరపాట్లు లేకుండా సవ్యంగా చూసుకోవాలని కలెక్టర్ మానిక్కరాజ్ కణ్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గొర్రెల పంపిణీ మానిటరింగ్ సిస్టమ్‌పై మండల తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పశువైద్య అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గొల్ల, కురమ, యాదవ కులా ఆర్థిక పరిపుష్టి కోసం గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో గొర్రెల పెంపకానికి ముందుకు వచ్చే గొల్ల, కురమ, యాదవ కుటుంబాలకు చెంది 18 సంవత్సరాలు నిండి సంఘంలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు అర్హులన్నారు. గొల్ల, కురమ, యాదవ కులాల సంఘాలు ఉండగానే సరిపోదని, అందులో అర్హులై, గొర్రెల పెంపకానికి ఆసక్తి గల వారందరూ సభ్యులుగా నమోదై ఉండాలన్నారు. సొసైటీలు లేని గ్రామాలలో అవసరమైన చోట కొత్త సొసైటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 11 నుండి 20 వరకు గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు. త్రిసభ్య కమిటి సమక్షంలో లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అర్హులైన దరఖాస్తుదారులలో 50 శాతం మందిని 2017-18 సంవత్సరానికి లాటరీ ద్వారా ఎంపిక చేసి గొర్రెల పంపిణీ చేయాలన్నారు. మిగిలిన 50 శాతం మందికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సొసైటీలో లేని వారు గొర్రెలు కావాలని కోరినట్లైతే వెంటనే సొసైటీలో సభ్యులుగా చేర్పించి వారి దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గొర్రెల యూనిట్ కావాలంటూ కోరిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకంలో లబ్దిచేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశువైద్యులకు మండలం, గ్రామం వారిగా గొల్ల, కురమ, యాదవ కుటుంబాల వివరాలు, సొసైటీలలో ఉన్న సభ్యుల సంఖ్య ఖచ్చితంగా తెలిసి ఉండాలని ఉద్భోదించారు. దరఖాస్తుదారులు చదువు వచ్చిన అభ్యర్థులైనప్పటికీ సమర్పించే దరఖాస్తులో మాత్రం సంతకం వేలి ముద్ర మాత్రమే పెట్టాలని ఆయన సూచించారు. అదే విధంగా ఏ సొసైటీలోని సభ్యులకు ఆ సొసైటీ అధ్యక్షులు దరఖాస్తుపై కౌంటర్ సంతకం చేయాల్సి ఉంటుందని అన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో అర్హులు, అనర్హులను గుర్తించి అర్హులైన వారిని మాత్రమే లాటరీ దావరా ఎంపిక చేయాలన్నారు. గ్రామ సభలో ఎవరైనా దరఖఆస్తు ఇచ్చినట్లైతే స్వీకరించాలని, సొసైటీలో సభ్యులు కానిచో ఉన్న సొసైటీలో సభ్యత్వ రుసుము తీసుకొని చేర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామ సభ నిర్వహించు గ్రామాలలో ముందు రోజు టాం టాం చేయించి గొర్రెలు కావాలనుకున్న వారు నేరుగా గ్రామ సభకు దరఖాస్తుతో రావాలని తెలిపారు. ఆయా సొసైటీల అధ్యక్షులు తమ సొసైటీలో గల సభ్యులను దృవీకరించే విధంగా చూడాలన్నారు. ఈ నెల 11 నుండి ముందుగా మూడు రోజుల పాటు సొసైటీలలో పూర్తి స్థాయిలో సభ్యులుగా ఉన్న గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు. ఏలాంటి అవకతవకలు చోటుచేసుకున్నా సహించేది లేదని, తగిన జాగ్రతలు పాటించాలని అధికారులను అప్రమత్తం చేసారు. త్రిసభ్య కమిటి గ్రామ సభలో అందరి సమక్షంలో లాటరీ తీసి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. లాటరీ ద్వారా నిర్వహించే ఎంపిక ప్రక్రియను మొబైల్‌లో వీడియోగ్రఫీ చేయాలన్నారు. గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు ఏ ఏ గ్రామాలలో టాం టాం చేయిస్తారో అక్కడ కూడా దరఖాస్తులు ఇవ్వాలన్నారు. ప్రతి రోజు గ్రామ సభ అనంతరం ఎంపిక చేసిన లబ్దిదారుల వివరాలను లాటరీ నంబరుతో సహా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని పశువైద్యాధికారులకు సూచించారు. ప్రతి దరఖాస్తుపైన త్రిసభ్య కమిటి సభ్యులైన మండల తహశీల్దార్, ఎంపిడిఓ, పశు వైద్య అధికారి సంతకాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. గొర్రెల అభివృద్ధి పథకం పటిష్టంగా అమలు జరిగేలా సంబంధిత అధికారులు సంయుక్తంగా పని చేయాలన్నారు. గొర్రెల పథకానికి నిర్వహించు గ్రామ సభలో ఒంటరి మహిళ పథకానికి సంబంధించి ఆయా గ్రామాల్లో అర్హులైన ఒంటరి మహిళల దరఖాస్తులను కూడా స్వీకరించాలని, స్థానికంగా గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా విచారణ చేయించి, సంబంధితుల నుండి దృవపత్రాలను తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. టాం టాం చేయించినప్పుడే ఒంటరి మహిళ దరఖాస్తులను కూడా గ్రామ సభలో ఇవ్వవచ్చని చెప్పించాలన్నారు. ఈ నెల 11 నుండి 13 వరకు ఒంటరి మహిళల దరఖాస్తులను స్వీకరిస్తున్నందున 13వ తేదీ రెండవ శనివారం కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ఖచ్చితంగా తెరిచి ఉంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. 13 వరకు స్వీకరించిన దరఖాస్తులను విచారణ చేయాల్సిన బాధ్యత తహశీల్దార్లదే అన్నారు. ఈ అవగాహన సదస్సులో పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అశోక్‌కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహశీల్దార్లు, పశు వైద్యాధికారులు పాల్గొన్నారు.