మెదక్

పేదలకు అండగా సిఎం సహాయ నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 15 : అనారోగ్యంతో ఉన్నవారికి తెలంగాణ సర్కార్ అండగా ఉంటు అత్యవసర సేవలను వైద్య సేవలందిస్తు ఆదుకుంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. పేదప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సిఎం సహాయ నిధితో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తు వారికి భరోసా కల్పిస్తుందన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలోని 9 మందికి సిఎం రిలిఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు. నియోజక వర్గంలో అత్యధిక మందికి సిఎం రిలిఫ్ పండ్ ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినట్లు పేర్కొన్నారు. నియోజక వర్గంలో ఇప్పటి వరకు 1507 మందికి సిఎం సహాయ నిధి ద్వారా 9.27 కోట్లు లబ్ధి పొందారన్నారు. ఆర్హులైన పేదలందరికి సిఎం సహాయ నిధి కింద ఆదుకుంటామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.

బాల్యవివాహాల నివారణకు ప్రత్యేక చర్యలు

* బాలల హక్కుల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ భారతి
మెదక్, మే 15: బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాలల హక్కుల పరిరక్షణ కోసం, హక్కుల ప్రచారం కోసం జిల్లాలో ప్రచార రథాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి తెలిపారు.
సోమవారం కలెక్టర్ బాలల హక్కుల ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టడం కోసం ఈ ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో 90 గ్రామాల్లో సమస్య ఎక్కువగా ఉందని, ఆ గ్రామాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ ప్రచార రథం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రానున్న 30 రోజుల్లో జిల్లాలోని అన్ని గ్రామాల్లో బాల్య వివాహాలపై, బాలల హక్కులపై చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు, జిల్లా డిడబ్ల్యూఓ జ్యోతి పద్మ తదితరులు పాల్గొన్నారు.