మెదక్

ప్రేమించి..పెళ్లికి నిరాకరించి..ఇదేమిటంటే.. బలవన్మరణ యత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, మే 16: ఓ యువతితో కానిస్టేబుల్‌కు మూడేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరుకావడం, యువతి తల్లిదండ్రులు పెద్దగా వరకట్నం ఇవ్వలేరన్న సాకుతో పెళ్లికి నిరాకరించిన కానిస్టేబుల్ మరో యువతితో ఈ నెల 14న నిశ్చితార్ధం జరిగింది. దీంతో సదరు యువతి తల్లిదండ్రులు కానిస్టేబుల్‌ను మరోసారి అడిగేందుకు పిలవగా అక్కడికి వచ్చిన వెంటనే నిద్రమాత్రలు మింగిన సంఘటన మంగళవారం మెదక్‌లో చోటుచేసుకుంది. వెంటనే తమకు న్యాయం చేయాలంటూ యువతి తల్లిదండ్రులు జిల్లా ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎ.ప్రతాప్‌కు సంగారెడ్డిలో డైట్ చదువుతుండగా మంబోజిపల్లి గ్రామానికి చెందిన యువతితో ఒక మిత్రుని ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి వరకు వచ్చింది. అయతే ఇద్దరి కులాలు వేరుకావడం, కట్నం కూడా తనకు ఆశించిన మేర రాదనుకున్న కానిస్టేబుల్ యువతిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. రెండు రోజుల క్రితం మరో యువతితో నిశ్చితార్ధం జరిగింది. దీంతో ప్రేమించిన యువతి తీవ్ర ఆందోళనకు గురైంది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశావంటూ మంగళవారం గ్రామ పెద్దలను ఆశ్రయించగా వారు కానిస్టేబుల్‌తో మాట్లాడడానికి పిలిచారు. మెదక్ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లోకి వచ్చిన కానిస్టేబుల్ ప్రతాప్ వారి వద్దకు రాగానే తన పెళ్లిని చెడగొట్టేందుకు యత్నిస్తున్నారంటూ నిద్రమాత్రలు మింగాడు. తనకు న్యాయం చేయాలంటూ యువతితోపాటు తల్లిదండ్రులు ఎస్‌పి కార్యాలయానికి వెళ్లి కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు.
పిలిచి పిడిగుద్దులతో దాడిచేశారు: కానిస్టేబుల్ ప్రతాప్
పిలిచి పిడిగుద్దులతో దాడిచేశారని, అవమాన భారంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కానిస్టేబుల్ ప్రతాప్ తెలిపాడు. మంబోజిపల్లికి చెందిన యువతితో తనకు మూడేళ్లుగా పరిచయం వాస్తవమేనన్నాడు. గత ఆరు నెలలుగా ఆమెతో మాట్లాడడంలేదని, యువతి సూచన మేరకు సెల్‌ఫోన్ సిమ్‌ను కూడా మార్చుకున్నానన్నాడు. ఆ యువతిని మరో యువకుడికి పెళ్లి చేయడానికి నిర్ణయించినందున అడిగినంత కట్నం ఇవ్వలేని పరిస్థితిలో తనకు ఏదో రకంగా పెళ్లి చేయడానికి పథకం పన్నారని ఆరోపించాడు. తనపై దాడిచేసిన వ్యక్తులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.