మెదక్

రూ.కోటితో పోలీస్‌స్టేషన్ భవనం, సిఐ క్వార్టర్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ మే 16: పాతకాలపు ఖేడ్ పోలీస్టేషన్ భవనం కూల్చివేసి కోటి రూపాయలతో నూతన భవనం నిర్మించేందుకు పరిశీలన చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి విలేఖరులకు తెలిపారు. అయన మంగళవారంనాడు సాయంత్రం ఖేడ్ పాత పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌తోపాటు సిఐ క్వార్టర్స్‌ను నిర్మిస్తామన్నారు. నూతన భవనం మొదటి, రెండో అంతస్థులను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు అయన చెప్పారు.
పోలీస్ క్వార్టర్స్‌లో పోలీసులు ఉండక పోవడానికి కారణాలు జీతాలు ఎక్కువగా పెరిగాయని క్వార్టర్స్‌లో ఉంటే నెలకు అరు వేల నుంచి 10వేల వరకు కటింగ్ అవుతున్నాయని, బయట ప్రైవేటు భవనంలో అద్దెకు ఉంటే రూ.3వేల నుంచి 4వేలు ఖర్చవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యంగా క్వార్టర్స్ మరమ్మతులకు నిధులు రావడంలేదని తెలిపారు. ఖేడ్‌లో ప్రతేక్యంగా పేరున్న గంజాయి సాగును రైతులు తగ్గించినటు తెలిపారు. ఎండి గంజాయి మాత్రం ఒడిశా, లేదా విశాఖపట్టణం నుంచి కర్ణాటక, మహరాష్ట్రాలకు వ్యాపారస్తులు దొంగచాటుగా రవాణా కొనసాగిస్తున్నారని, వారిపై ప్రత్యేక నిఘా వేసినట్లు తెలిపారు. గంజాయి రవాణపై , లేదా గంజాయి సాగు చేసే వారి సమాచారం ఇస్తే వెంటనే దాడులు చేసి పట్టుకుంటామని అన్నారు. అక్రమ వ్యాపారం ఏదైనా సరే సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయని దొంగతనాలు నివారణకు ముఖ్యమైన రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో ప్రైవేటు వ్యాపారస్థులకు సైతం దుకాణాల ముందు సీసీ కెమెరలను ఏర్పాటు చేసుకోవాలని అదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. గత మూడు నెలలు క్రితం రాంచంద్రాపురం మూత్తుట్ ఫైనాన్స్‌లో కర్ణాటక వ్యక్తులు చొరబడి బంగారం, నగుదును ఎత్తుకుపోతే సీసీ కెమెరాల అధారంగా దొంగలను పట్టుకుని జైలుకు పంపించిన విషయాన్ని అయన గుర్తుచేశారు. శాంతి భధ్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
డిఎస్పీ యాదగిరిరాజు, సి ఐ సైదానాయక్, ఖేడ్ ఎస్‌ఐ నరేందర్, మనూరు నాగేశ్వర్‌రావు, ఏడుకొండల్, తదితరులున్నారు. ఖేడ్ పోలీస్ స్టేషన్ నిర్మాణంలో దారి ఏ వైపు ఉండాలనే దానిపై వాస్తుప్రకారం ఎక్కడా ఉంచితే బాగుటుందని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఎస్ ఐ నరేందర్‌ను అడిగి సూచనలను తీసుకున్నారు.