మెదక్

నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో రూ. 2.25కోట్ల వ్యయంతో నిర్మించిన జూనియర్ కళాశాలను మంత్రి హరీశ్‌రావుతో కలిసి ప్రారంభించిన సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంతోపాటు మంజూరి చేసిన కళాశాలలకు పక్కా భవనాల నిర్మాణం చేపట్టలేదని, ప్రభుత్వ విద్యను పటిష్టం చేసే క్రమంలో పెద్ద ఎత్తున నిదులు వెచ్చిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో 404 జూనియర్ కళాశాలలుండగా, 399 కళాశాలలకు రూ. 300కోట్ల వ్యయంతో పక్కా భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్దిని దృష్టిలో పెట్టుకొని 525 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయగా, 6లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. కాగా రూ. 12వేల కోట్ల వ్యయంతో 525 గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటుండగా, 16వేల మంది ఉపాద్యాయుల నియామకానికి సిఎం కెసిఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. కాగా ఈ విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8 తరగతులకు ఈ గురుకులాల్లో అడ్మిషన్‌లకు అవకాశం కల్పించగా, వచ్చే యేడాది నుండి ఒక్కో తరగతి పెరగనున్నట్లు చెప్పారు. ప్రస్థుత పోటీ ప్రపంచంలో పేద విద్యార్థులు సైతం ప్రతిబ చాటే విదంగా కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్‌రూమ్‌లు వంటి మెరుగైన సదుపాయాలు కల్పించి వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నట్లు చెప్పారు. సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగునంగా విద్యాశాఖ పనిచేస్తుండడంతో చక్కటి ఫలితాలు సాదిస్తూ దేశంలోనే తెలంగాణ విద్యా వ్యవస్థ ఆదర్శంగా నిలిచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రహదారుల అభివృద్ది సంస్థ కార్పోరేషన్ చైర్మెన్ తూంకుంట నర్సారెడ్డి, హౌజింగ్ కార్పోరేషన్ చైర్మెన్ భూంరెడ్డి, ఫుడ్ సొసైటీ చైర్మెన్ ఎలక్షన్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపిపి అధ్యక్షులు కళావతి విద్యాకుమార్, జెడ్‌పిటిసిలు పోచయ్య, రాంచంద్రం, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఎంపిపిలు నిమ్మ రంగారెడ్డి, నాయిని యాదగిరి, గడా అధికారి హన్మంతరావు, ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, డిఈఓ కృష్ణారెడ్డి, టిఆర్‌ఎస్ నేతలు మాదాసు శ్రీనివాస్, డాక్టర్ యాదవరెడ్డి, టేకులపల్లి రాంరెడ్డి, ఊడెం కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, ఎంపిడిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బోనాలు.. ఐక్యతకు ఆనవాళ్లు
* ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సదాశివపేట: విభిన్న జాతులు, మతాలు, కులాలకు ఆలవాలమైన భారతదేశ ప్రజలు నిర్వహించుకునే ప్రతి పండుగ వెనక ఓ చక్కటి మార్గదర్శనం కనిపిస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలు ప్రజల మద్య ఐక్యతకు ఆనవాళ్లుగా కనిపిస్తున్నాయన్నారు. మంగళవారం సదాశివపేట పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సామూహిక బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ పంక్షన్‌హాల్‌లో సహపంక్తి భోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పూర్వీకులు ఇలాంటి సామూహిక పండుగలను నిర్వహిస్తూ వచ్చారని అదే స్ఫూర్తి నేటికి కొనసాగుతుందన్నారు. సామూహికంగా పండుగలను నిర్వహించడం వల్ల పేద, ధనిక, పెద్ద, చిన్నా అనే తరతమ బేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి సంతోషంగా గడుపుతారన్నారు. సదాశివపేట పట్టణం ఆవిర్భావం నుంచి కూడా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుందన్నారు. అన్ని కులాలు, మతాల వారు పరస్పర సహకారంతో పండుగలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కౌన్సిలర్ చింతా గోపాల్‌తో పాటు పద్మశాలి కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఎడతెరిపి లేని వర్షం
రామచంద్రాపురం, : గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా పడిన వర్షంతో జనమంతా తడిసి ముద్దయ్యారు. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కురిసిన జల్లులతో రామచంద్రాపురం మండల వ్యాప్తంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొద్దిసేపు జల్లులు మరి కొద్దిసేపు మోస్తారు వర్షంతో రోజంతా వరుణుడు తన ప్రతాపం చూపించడంతో జనాలు బయటకు వెళ్లేందుకే జంకారు. మరో వైపు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో స్థానిక ప్రజలు వర్షం నీటితో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో అత్యధికంగా జిన్నారం మండలంలో వర్షపాతం నమోదు అవ్వగా అత్యల్పంగా పటాన్‌చెరు ప్రాంతంలో నమోదు అయ్యింది. రామచంద్రాపురంలో 24 గంటలుగా అడపా దడపా కురిసిన వర్షపాతం 4.8గా నమోదు అయ్యింది. మండల పరిధిలోని తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూరు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. రామచంద్రాపురం పట్టణ పరిధిలోని బీరంగూడ, మల్లికార్జునగర్, బొంబాయి కాలనీ, ఇక్రిశాట్ ఫెన్సింగ్ కాలనీ, పాత రామచంద్రాపురం కాలనీలన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. బీరంగూడ కమాన్ నుండి కిష్టారెడ్డిపేట వెల్లే దారిలో వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలకు వర్షం నేపత్యంలో మంగళవారం సెలవు ప్రకటించారు. జాతీయ రహదారిపై నాగులమ్మగుడి వద్ద కల్వర్టు నిర్మాణం ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో వర్షపునీరు చేరి ట్రాఫిక్ అంతరాయం ఎర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వర్షంలో సైతం స్థానిక ట్రాఫిక్ పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కల్వర్టు నిర్మాణాల్లో వర్షపునీరు చేరడంతో పనులు ముందుకు సాగక ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఈ వర్షాకాలంలో అత్యధిక వర్షం ఈ రెండు రోజుల్లోనే కురవడంతో జనజీవనం స్తంభించి పోయింది. మరో రెండు రోజులు ఇలాగే వర్షపాత సూచన ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

మెదక్ జిల్లాలో 225.2 మిల్లిమీటర్ల వర్షపాతం
* ఘణపురం ప్రాజెక్ట్ నిండి
కుడి, ఎడమ కాలువలు నీళ్లతో కళకళ
మెదక్: కురుస్తున్న వర్షాలతో ఇంటి నుండి బయటకు బయలుదేరని పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం మెదక్ జిల్లాలో 262 మిల్లిమీటర్ల వర్షపాతానికిగాను 225.2 మిల్లిమీటర్ల వర్షపాతం కురిసినట్లు జిల్లా ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసయ్య తెలిపారు. ప్రజలు, విద్యార్థులు గొడుగుల రక్షణలో వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడం కనిపించింది. వర్షంతో మెదక్ పట్టణం చిత్తడిగా మారింది. గుంతలలో నీళ్లు నిలిచాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కానీ రైతులకు మాత్రం చాలా ఆనందంగా ఈ వాతావరణం తోడ్పడింది. ఘణపురం ప్రాజెక్ట్ నిండి పొంగిపొర్లడంతో ఎంఎన్ కెనాల్, ఎఫ్‌ఎన్ కెనాల్స్ నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఈ రెండు కాలువలు పారడంతో రైతులు ఆఘమేఘాలపై వారి వారి పొలాల్లో నాట్లు వేసుకుంటున్నారు. చివరి భూములకు నీళ్లు ఇస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించడంతో చివరి భూముల రైతులు కూడా ఆనందంతో వారి పొలాలను సాగులోకి తెచ్చుకుంటున్నారు. ఇందుకోసం అవసరమైన డబ్బును వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంక్‌లు మాత్రం ప్రభుత్వం హెచ్చరించినా, జిల్లా యంత్రాంగం బ్యాంక్ అధికారులతో సమావేశాలు నిర్వహించినా రైతులకు మాత్రం అప్పులు ఇవ్వడంలో వెనుకంజ వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వర్షాలతో చాలీచాలని గుడిసెలలో నివసిస్తున్న నిరుపేదలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని అధికారులు గుర్తించి సురక్షిత ప్రాంతాలకు చేర్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎ.మల్లేశం డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే రైతులకు విత్తనాలు, ఎరువులు సమకూర్చాలని, బ్యాంక్‌లలో రైతులకు అప్పులు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం

సంగారెడ్డి టౌన్: బ్యాంకర్లు సామాజిక స్పృహాతో స్వయం సహాయక ఉద్యమానికి ఊతం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ పేర్కొన్నారు. నాబార్డ్ 36వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సమాజానికి దగ్గరగా ఉంటూ స్వయం సహాయక సంఘాలకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. 25యేళ్ల క్రితం ఒక చిన్న కార్యక్రమంగా ప్రారంభమైన స్వయం సహాయక సంఘాల ఉద్యమం అనతికాలంలోనే సమాజంలో నమ్మకాన్ని తెచ్చుకుందన్నారు. పేదలకు రుణాలు ఇవ్వచ్చా అన్న సందేహం కలిగిన రోజు నుండి నేడు స్వయం సహాయక సంఘాలకు రుణం ఇస్తే రుణ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తారన్న నమ్మకం ఏర్పడిందన్నారు. స్వయం సహాయక సంఘాలతో ఉండే నిబద్ధత ఆ ఉద్యమానికి నేటికి ఊపిరి పోస్తుందన్నారు.
బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చే విషయంలో క్రీయాశీలకంగా వ్యవహరించాలన్నారు. బ్యాంకర్లు ఆస్తులపైన రుణాలు ఇవ్వడమే కాకుండా వినియోగదారుని అవసరాల నిమిత్తం రుణాలు ఇచ్చినట్లైతే వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మానవాత దృక్పదంతో అవసరాలను గుర్తించి రుణాలు మంజూరు చేస్తే రుణ గ్రహిత అప్పుల భారి నుండి తప్పించుకోవచ్చాన్నారు. సూక్ష్మ రుణ ప్రణాళిక ముఖ్య భూమిక వహిస్తుందన్న విషయాన్ని బ్యాంకర్లు విస్మరించకూడదన్నారు. కేవలం లక్ష్యం చేరుకునేందుకే కాకుండా రుణ అవసరాలను గుర్తించి తదనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని, తద్వారా స్వయం సహాయక సంఘాలలో బ్యాకింగ్ వ్యవస్థపై నమ్మకం ఎర్పడుతుందన్నారు. ఆర్థిక విషయాలలో క్రమశిక్షణగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన స్వయం సహాయక సంఘాల సభ్యులు, బ్యాంకర్లను కలెక్టర్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో నాబార్డ్ ఎజిఎం రమేష్‌కుమార్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట లీడ్ బ్యాంక్ మేనేజర్లు లక్ష్మికాంతరావు, నాగరాజు, పవిత్రన్, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

రూ.33 కోట్లతో పసుపులేరు వాగుకు హై లెవల్ బ్రిడ్జి
* మెదక్ పట్టణానికి బైపాస్, రింగు రోడ్డుకు ప్రతిపాదనలు
* ఉపసభాపతి పద్మ వెల్లడి
మెదక్: రూ.33 కోట్లతో పసుపులేరు వాగు వద్ద హైలేవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాధనలు పంపడంతో పాటు హైవే నిర్మాణంలో మెదక్ పట్టనానికి బైపాస్ రహదారి నిర్మాణానికి సైతం ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మెదక్ పట్టణంలో నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మెదక్ పట్టణానికి అనుకొని ఉన్న పసుపులేరు వాగు బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి, మెదక్ పట్టణ బైపాస్ రహదారి నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని మంత్రిని అడిగినట్లు ఆమె తెలిపారు. గతంలో మెదక్ పర్యటనలో సిఎం హామీ మేరకు మెదక్ పట్టణం రింగ్‌రోడ్డుకు ఈ సంవత్సరం ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. ఎన్‌హెచ్ 44 నుండి దామరచెర్వు వరకు పెద్ద రోడ్డును మంజూరు చేయలని మంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు. పెద్దబజార్, ఫత్తేనగర్ రోడ్డు విస్తరణకు నిధుల మంజూరికి మంత్రి హామీ ఇచ్చినట్లు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. పాతూర్ వద్ద, అక్కనపేట వద్ద రైల్వేబ్రిడ్జి నిర్మాణాన్ని హైవే నిర్మాణానికి అనువుగా నిర్మించాలని రైల్వే అధికారులకు సూచించినట్లు తెలిపారు. సంవత్సరం లోపల మెదక్ పట్టణానికి రైలు కూత వచ్చేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. మరో 15 ఎకరాల మరో భూసేకరణ అవసరం ఉందని త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు సూచించినట్లు ఆమె తెలిపారు. అనంతరం మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంభాలకు రెండు లక్షల రుపాయల చొప్పున చెక్కులను అందజేశారు. జడ్పిటిసి లావణ్యరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ మాయ మల్లేశం, ఆర్‌కె.శ్రీనివాస్, జీవన్‌రావు, రాయిన్‌పల్లి అంజయ్య పాల్గొన్నారు.