మెదక్

పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 17: సంగారెడ్డి పురపాలక సంఘానికి సంబంధించిన పనులు చేయకుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న వివిధ పనులపై ఆదివారం ఎమ్మెల్యే సమీక్షించారు. ప్రస్తుతం వివిధ వార్డుల్లో కొనసాగుతున్న సిసి రోడ్లు, డ్రైనేజ్ తదితర పనులు, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. పోతిరెడ్డిపల్లి నుండి పాత బస్టాండ్ వరకు సుమారు 14కోట్ల రూపాయలతో కొనసాగుత్ను రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, రోడ్డు విస్తరణ పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి భూమి చుట్టు కంచేను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 18నుండి 20 వరకు పంపిణీ చేసే బతుకమ్మ చీరలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అర్హులైన వారందరికి సక్రమంగా చీరలు అందే విధంగా విధంగా చూడాలని మున్సిపల్ కమీషనర్ కుమారస్వామిని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్ధన్‌నాయక్, మున్సిపల్ అధికారులు, పలువురు టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పారదర్శకంగా చీరల పపిణీ

సంగారెడ్డి, సెప్టెంబర్ 17: బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో మహిళలు ఏలాంటి అపోహలకు గురికావద్దని కలెక్టర్ మానిక్యరాజ్ కణ్ణన్ తెలిపారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జిల్లాలో ఈ నెల 18 నుండి మూడు రోజుల పాటు అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేసారు. చీరలు తీసుకోబోయే మహిళలకు ముందుగానే కూపన్లు అందిస్తున్నామన్నారు. కూపన్ తీసుకువెళితేనే చీర అందిస్తారని, లేకుంటే చీర ఇవ్వరన్న అపొహను మహిళలు పట్టించుకోవద్దన్నారు. బతుకమ్మ చీర తీసుకోవడానికి వచ్చేప్పుడు కూపన్‌తో వస్తే చీర సరఫరా తొందరగా అవుతుందన్నారు. కూపన్ లేకుండా వచ్చినా, వారి వివరాలను పరిశీలించి చీర అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చీరలు తీసుకోవడానికి వచ్చే మహిళలు కూపన్‌తో పాటు ఆధార్ కార్డుకాని ఏదేని గుర్తింపు కార్డును తమ వెంట తీసుకురావాలన్నారు. అర్హులైన మహిళలందరికి బతుకమ్మ చీరలను అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు పంపిణీ చేయనున్న బతుకమ్మ చీరలను 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు అందిస్తారన్నారు. చీరల పంపిణీలో ఏలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చీరలు తీసుకోబోయే ప్రతి మహిళకు ముందుగానే కూపన్లు అందిస్తున్నామన్నారు. గ్రామాలకు చీరలు చేరాయని, పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు. ప్రతి మహిళకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో కూపన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కూపన్‌పై మహిళ పేరు, రేషన్ షాపు నెంబరు, క్రమ సంఖ్య ఉంటుందన్నారు. తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు, విఆర్‌ఓలు, విఆర్‌ఎల సమక్షంలో ఐకెపి సిబ్బంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తారన్నారు. ఏ ఒక్కరికి చీర అందలేదన్న ఆరోపణలు రాకుండా చీరల పంపిణీని పారదర్శంగా నిర్వహించేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్, మెప్మా సిబ్బంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, అందోల్-జోగిపేట మున్సిపాలిటీల్లో మహిళలకు చీరలు అందిస్తారని కలెక్టర్ వెల్లడించారు.