మెదక్

అమరుల త్యాగాలను మరవడం శోచనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్,సెప్టెంబర్ 17: తెలంగాణ అమరవీరుల త్యాగాలను మరిచి రెండు నలుకల దోరణితో వ్యవహరిస్తున్న టిఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు వాకిటి సునీతారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారంనాడు నర్సాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమే మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ఒక మాట వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అనే విధంగా వ్యవహరిస్తున్న కెసిఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కెసిఆర్ అనేకమైన వాగ్ధానాలు చేసి మరిచిపోయారని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు డబల్‌బెడ్‌రూం ఇళ్లు ఎక్కడ అని ప్రశ్నించారు. ఇప్పటికైన కెసిఆర్ రెండు నాలుకల దోరణిని విడనాడాలని లేని పక్షంలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని అన్నారు. తెలంగాణ రాకముందు సెప్టెంబర్ 17ను విమోచన దినాన్ని అధికారికంగా జరపాలంటూ డిమాండ్ చేసిన కెసిఆర్ అధికారం వచ్చిన తర్వాత మాటమార్చారని ఎద్దేవ చేశారు. మనతో పాటు మహారాష్ట్రా, కర్నాటక రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి లభించిందని వారు అధికారికంగా జరుపుకొంటున్నారని గుర్తు చేశారు. కెసిఆర్ రాజకీయాల కోసం సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపడం లేదని అన్నారు. కాంగ్రెస్ హయంలో రెవెన్యూ సదస్సులు పెట్టి భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం జరిగిందని అన్నారు. గ్రామాల్లో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారితో రైతు సమన్వయకమిటీలు ఏర్పాటు చేసి భూ రికార్డులను ప్రక్షాళణ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రైతులకు ఇబ్బందులు కల్గించే విధంగా సమన్వయకమిటి సభ్యులు వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ వారి తరపున పోరాటం చేస్తుందని అన్నారు. సమావేశంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశ్, ఎంపిటిసి సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సత్యంగౌడ్, నయిం, రషీద్, జీవన్‌రెడ్డి, రాజేష్ పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలపై జెండావిష్కరణకు బిజెపి విఫలయత్నం
* నేతలు..కార్యకర్తల అరెస్టు
జహీరాబాద్, సెప్టెంబర్ 17: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పలు ప్రభుత్వ కార్యాలయాపై బిజెపి నాయకులు, ఎబివిపా కార్యకర్తలు విఫల యత్నం చేశారు. జహీరాబాద్ తహసిల్ కార్యాలయంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు వెళ్తున్న ఎబివిపి నాయకులు పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అదేవిధంగా న్యాల్‌కల్ మండల బిజెపి అధ్యక్షులు అశోక్‌పాటిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. మండల తహసిల్ కార్యాలయంపై జెండాను ఆవిష్కరించేందుకు బయలుదేరారు. పోలీసులు అడ్డుకుని బిజెపి నాయకులు, కార్యకర్తలను అరెస్టుచేసి హద్నూర్ పోలిస్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో పార్టీ నాయకులు విశ్వనాథ్ యాదవ్, పూలసంతోష్, మల్లికార్జున్‌పాటిల్, శ్రీనివాస్‌గుప్తా, జనార్దన్‌రెడ్డి, బండి వెంకట్ ఇతర నాయకులు కార్యకర్తలు న్నారు. బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణాకౌళాస్ పట్టణంలోని పలు బూత్‌లలో, భవానీ శక్తి కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతపై స్థానికుల్లో అవగహన కల్పించారు. 159, 160, 161, 164వ బూత్ కార్యాలయాల్లో నిర్వహించిన జెండా ఆవిష్కర్‌లో పార్టీ నాయకులు అర్చన, బస్వరాజ్‌పాటిల్, అమర్, అనిత, రఘు, వేణు, రాము, శివ తదితరులు పాల్గొన్నారు.