మెదక్

బతుకమ్మ చీరల పంపిణీ మరోరోజు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొట్టమొదటిసారిగా ప్రభుత్వం మహిళలకు బ తుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మూడురోజుల్లో పూర్తి స్థా యిలో అర్హులైన మహిళలు అందరికి బతుకమ్మ చీరలను పంపిణీ చేయాల ని నిర్దేశించినా గడవులోగా పూర్తి కా నందున ప్రభుత్వం మరోరోజు పొడగి ంచాలని అధికారులను ఆదేశించింది. ఈనెల 21వ తేదీ సాయంత్రం వరకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 4,37,413 మంది మహిళలను బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి అర్హులుగా గు ర్తించారు. ఇప్పటివరకు సంగారెడ్డి జి ల్లాలో 2,78,041 మందికి చీరల పం పిణీ చేసారు. సగానికిపైగానే చీరల ప ంపిణీ చేపట్టినా పూర్తిస్థాయి లక్ష్య సా ధన కోసం మరోరోజు ప్రభుత్వం కా ర్యక్రమాన్ని పొడగించింది. సిద్దిపేట, మెదక్ జిల్లాలో కూడా కార్యక్రమాన్ని మరోరోజు పొడిగించారు. చీరల్లో నా ణ్యత లేదనే ప్రచారంతో కూడా కొంత మంది మహిళలు చీరలను తీసుకోవడానికి అనాసక్తిని కనబరుస్తున్నారన్న ప్రచారం కొనసాగుతోంది. మరికొంత మంది మహిళలు గతంలో ఏ ప్రభు త్వం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించలేదని, ఇచ్చిన చీరలపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భిన్నాభిప్రాయాల మధ్య చీరలపంపిణీ కొనసాగుతోంది.

నేటినుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు

మెదక్ రూరల్, సెప్టెంబర్ 20: అ మ్మదయ ఉంటే అన్నీ ఉంటాయంటా రు పెద్దలు... అమ్మలగన్నయమ్మ ము గ్గురమ్మల మూలపుటమ్మ... దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 21 ను ండి ప్రారంభం కానున్నాయి. ప్రసిద్ద పుణ్యక్షేత్రాలతోపాటు వినాయక ఉత్సవాల మాదిరిగా గ్రామాలు, పట్టణాల్లో వాడవాడల్లో దేవి నామస్మరణ మారుమ్రోగనుంది. ఇందుకోసం మంటపా లు ముస్తాబవుతున్నాయి. ‘సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే’ అ న్నట్లు అన్ని రూపాల్లో అమ్మవారు దర్శమిస్తారు. ఏ రూపంలో కొలిచినా ఆమె శక్తిని వర్ణించలేము. పది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో అమ్మను చూడ రెండు కళ్లు చాలవు. నిత్యం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో దర్శనమిస్తుంది. ఈనెల 21 నుండి దుర్గా, బాలాత్రిపురసుందరీదేవి, రాజరాజేశ్వరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితాత్రిపురసుందరీదేవి, మహాలక్ష్మీ, మహిషాసురమర్దిని, చివరి రోజున విజయదుర్గగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనునా నరు. అమ్మవారి ఉత్సవాల అంగరంగవైభవంగా, భక్తితో జరిపేందుకు నిర్వాహకులు మంటపాలను వివిధ రూపాల్లో సిద్దం చేస్తున్నారు. మెదక్, హవేళీఘణాపూర్ మండలాల్లో పేరూర్ శ్రీసరస్వతీ ఆలయంతోపాటు రాజ్‌పల్లి, అవుసులపల్లి, ఖాజిపల్లి, హవేళీఘణాపూర్, సర్ద న, జక్కన్నపేట, రాజ్‌పేట, నాగాపూర్ గ్రామాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు జ రగనున్నాయి. కూచన్‌పల్లిలో పంచలో హ విగ్రహాన్ని తయారుచేయించిన వి షయం తెల్సిందే. అమ్మవార్ల ప్రతిమల ను ఆకర్షణీయంగా తయారుచేయిస్తున్నారు.

చెరకు రైతులకు శుభవార్త

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 20: గత సీజన్ 2016-17లో చెరుకు క్రిషింగ్‌కు సంబంధించిన రైతులకు రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించిన టన్నుకు రూ.60 ఇనె్సంటివ్‌ను ప్రభుత్వం విడుదల చే సిందని సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని సీ డీసీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన ఇనె్సంటివ్ డ బ్బులను విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓను విడుదల చేసిందన్నారు. రైతుల కు చెల్లించే ఇనె్సంటివ్‌ను ప్రతి సంవత సరం ఫ్యాక్టరీలు చెల్లించేవని, దానివల్ల రైతులు ఇబ్బందులు పడేవారన్నారు. కొందరికి వేస్తూ మరికొందరికి ఇచ్చే వారు కాదన్నారు. దానిని దృష్టిలో ఉం చుకొని రాష్ట్ర ప్రభుత్వం చెరుకు టన్ను కు రూ.60 ఇనె్సంటివ్‌ను నేరుగా రైతు ఖాతాలో వేయనుందన్నారు.గత సంవత్సరం చెరుకు టన్నుకు మద్దతు ధర రూ. 2890 నిర్ణయించి రైతులకు చెల్లించారని, ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు చెల్లించే ఇనె్సంటివ్‌తో కలిపి ధర రూ. 2950 అవుతుందన్నారు. జిల్లాలోని గ ణపతి, ట్రైడెంట్ పరిశ్రమలకు సంబంధించి రూ. 1కోటి 71లక్షలను ప్రభు త్వం విడుదల చేసిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ చొరవతో రైతులకు రా వాల్సిన ఇనె్సంటివ్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. గణపతి షు గర్ పరిధిలోని రైతులకు 1కోటి 17 లక్షలు, ట్రైడెంట్ పరిశ్రమ పరిధిలోని రైతులకు రూ. 54 లక్షలు విడుదల చే స్తూ ప్రభుత్వం జిఓ 202ను విడుదల చేసిందన్నారు. ఈ సంవత్సరం జిల్లా లో గణపతి, డ్రైడెంట్ పరిశ్రమలు, వి కారాబాద్, మెదక్ పరిధిలో 18,817 హె క్టార్లలో చెరుకు సాగు చేశారని తెలిపా రు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ (ఎఫ్‌ఆర్‌బి) ప్రకారం టన్నుకు రూ.2550 నిర్ణయించిందన్నారు. అదేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెరుకు రైతులకు మ ద్దతు ధరను ప్రకటిస్తుందని తెలిపారు. జిల్లాలో మద్దతు ధరను నిర్ణయించేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో చెరుకు రైతులు, ఫ్యాక్టరీల యజమానులు, సీడీసీలతో అక్టోబర్ 2వ వా రంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో చెరుకు మ ద్దతు ధరను రైతుల అంగీకారం మే రకు నిర్ణయించడం జరుగుతుందనా నరు. సీడీసీ ఆధ్వర్యంలో ఎక్కువ చె రుకు వేసిన రైతుల పొలాల వద్దకు అ ంతర్గత రోడ్లను వేస్తామన్నారు. రైతులకు కావాల్సిన కలుపుమందులను 25శాతం సబ్సీడీతో అందిస్తున్నట్లు తెలిపారు.

పెద్దల అమావాస్య రోజు మూగబోయిన కలెక్టరేట్

మెదక్, సెప్టెంబర్ 20: ప్రతినిత్యం ప్రజలతో కిటకిటలాడే జిల్లా కలెక్టరేట్ బుధవారం మూగబోయింది. తెలంగా ణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభు త్వ ఉద్యోగులకు పనిగంటలు ఎక్కువయ్యాయి. గత మూడు సంవత్సరాల తరువాత పెద్దల అమావాస్య రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దొరికిం ది. వీరందరు వారి కుటుంభాలతో కలి సి జీవించడానికి పెద్దల పండుగ సహకరించింది. అంతకుముందు రోజుల లో కుటుంభ సభ్యులతో కూడా కలవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితుల్లో విధులలో ఉద్యోగులు కొట్టుమిట్టాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో పనిచేసిన ఇంజనీర్లంతా తమ కుటుంబాలకు దూరమయ్యామని వా రు చెప్పిన విషయాలు విదితమే. కలెక్టరేట్‌లో ఉన్నటువంటి 41 శాఖలు ఉ దయం 10:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తూ కనిపించారు. జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి ప్రభు త్వం తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఆమె కుటుంభ సభ్యులతో ఎప్పుడు కలిసి ఉంటుందో చెప్పలేని పరిస్థితి. విధులతోపాటు ఆమె ఆరోగ్య పరిస్థితులపట్ల రాత్రి 7:30 గంటల నుండి 9 గంటల వరకు మినీ స్టేడియంలో బ్యాడ్మింటన్‌లో పా ల్గొంటారు. ఇటీవల స్వచ్చ హి సేవా కా ర్యక్రమంలో ఉదయం 7 నుండి 9 గం టల వరకు కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులంతా వారి విధులలో ఎంతో ప్రాధాన్యత చూపిస్తూ కలెక్టర్ ఆదేశాల మే రకు ప్రజాకార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమైన ఉద్యోగులందరు పెద్దల అమావాస్యనాటి ఒక్క రోజు విశ్రాంతి దొరికింది. వీరందరు వారి కుటుంబ సభ్యులతో కలిసిపోయారు. తిరిగి గురువారం నుండి వారి విధులలో పాల్గొంటారు. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకున్నారు. ప్రతిరోజు కలెక్టర్ కా ర్యాలయం ఆవరణలో ఆందోళనకారు లు కలెక్టరేట్ ముట్టడి, ధర్నాలు జరిగే వి. బుధవారం ఏఒక్కరు కూడా జిల్లా కలెక్టరేట్ ముందు కనిపించకపోవడం గమనార్హం. రామాయంపేటకు చెందిన పాస్టర్ పౌలు బైక్‌పై ఎంతో ఆసక్తితో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ మూగబోయిన విషయాన్ని చూసి ఈ రోజు పెద్దల అమావాస్య కారణంగా కలెక్టరేట్ నడవలేదని తానే స్వయంగా వివరించడం జరిగింది.

సింగూర్‌కు వరదనీరు

జోగిపేట, సెప్టెంబర్ 20: అందోల్ నియోజకవర్గ పరిధిలోని సింగూర్ ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29 టిఎంసిలు కాగా బుధవారం సాయంత్రానికి 26 టిఎంసిల వరకు నీరు వచ్చింది. మరో మూడు టిఎంసిల నీరు వస్తే సింగూర్ ప్రాజెక్ట్ పూర్తిగా నిండుతుంది. 27 టిఎంసిల తరువాత ప్రాజెక్ట్‌కు సంబంధించిన గేట్లను ఎత్తివేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగూర్ ప్రాజెక్ట్ ఎగువ భాగంలో ఉన్న కర్ణాటక నుండి ప్రతి రోజు వరద నీరు వస్తుంది. బుధవారం 511 క్యూసెక్కుల నీరు రావడం జరిగింది. సెప్టెంబర్ మాసంలోనే ప్రతి సంవత్సరం సింగూర్ ప్రాజెక్ట్‌లోకి వరద నీరు చేరుకోవడం, ప్రాజెక్ట్ నిండటం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాలువల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని, హైదరాబాద్ ప్రాంతానికి 127 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సింగూర్ ప్రాజెక్ట్‌లోకి పూర్తి స్థాయిలో చేరుకున్నందున గత మూడు రోజులుగా పర్యాటకులు అధికమయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సింగూర్ ప్రాజెక్ట్ వద్దకు వేలాది మంది పర్యాటకులు వస్తూ నీటిని వీక్షిస్తున్నారు. గత సంవత్సరం కూడా సెప్టెంబర్ 20 తరువాతనే సింగూర్ ప్రాజెక్ట్ పూర్తిగా నిండింది. వారం రోజుల్లోనే పూర్తి స్థాయికి నీరు చేరుకోవడం పట్ల రైతులు హర్షం ప్రకటిస్తున్నారు. సింగూర్ ప్రాజెక్ట్ నిండితే హైదరాబాద్ మంజీర పరివాహక ప్రాంతం కాలువలు లేని పరిధిలోని రైతులకు మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. రోజుకు ఒక టిఎంసి చొప్పున నీరు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మత్స్యకారులందరికీ ఉపాధి కల్పిస్తాం

రామచంద్రాపురం, సెప్టెంబర్ 20: నియోజకవర్గంలోని అన్ని చెరువులలో ఇప్పటికే చేపల పెంపకం ప్రారంభమైందని దీనివల్ల ప్రతి మత్స్యకారుడికి ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలు పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణ పరిధిలోని రాయసముద్రం చెరువులో బుధవారం వారు చేపపిల్లలను వదిలారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నివర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేక పథకాలను తీసుకువచ్చిందన్నారు. మిషన్ కాకతీయ పనులతో గ్రామా లు, పట్టణాల్లోని చెరువులన్ని జలకళను సంతరించుకున్నాయన్నారు.

భక్తుల కొంగు బంగారం రేణుక ఎల్లమ్మ

సిద్దిపేట, సెప్టెంబర్ 20: భక్తుల కోరి న కోరికలు తీర్చుతూ కొంగు బంగార ంగా విరజిల్లుతూ వేలాదిమంది భక్తుల నిత్యపూజలందుకుంటున్న సిద్దిపేట పట్టణ శివారులో వెలసిన శ్రీమహారేణు క ఎల్లమ్మ ఆలయం. ఈనెల 21 గురువారం నుండి రేణుక ఎల్లమ్మ ఆలయ శరన్నవ రాత్రోత్సవాలకు సర్వంగ సు ందరంగా ముస్తాబైంది. ఈనెల 21 గు రువారం నుండి 29 శుక్రవారం వరకు శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవ ంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్ల అంటే గ్రా మ శివారు అని అర్థం. శివారులో ఉండి గ్రామ పూజలకు రక్షణగా ఉంటుందని ఎల్లమ్మ ప్రసిద్ధి. అందులోను సిద్దిపేట లో వెలసిన ఎల్లమ్మ దేవాలయం మరిం త ప్రత్యేకం. సహజంగా ఎల్లమ్మ ఆల యం అంటే జంతుబలులుంటాయి. కాని ఇక్కడ జంతు బలులు పూర్తిగా ని షేధం. అంతేకాకుండా సిద్దిపేట అమ్మవారి ఆలయంలో శాక్త గురువు అయిల వఘాల వెంకట రమణయ్య ఆలయా న్ని ప్రతిష్టించారు. ఇక్కడ పూజల్లో అం త విశిష్టమైన శాక్త పద్దతిలో పూజలు నిర్వహిస్తారు. సహాజంగా అమ్మవారి గ ర్బగుడిలోకి భక్తులను అనుమతించ రు. కాని భక్తుల చేతుల మీదుగానే అ మ్మవారికి పంచామృతాలతో అభిషేకా లు నిర్వహించటం ఇక్కడ ఆలయ అ త్యంత ప్రత్యేకం. సిద్దిపేట ఎల్లమ్మ తల్లి ని పూజిస్తే సంతానం లేనివారికి సం తానం కలుగుతుందని, ధీర్ఘకాలిక వ్యా ధులతో బాధపడేవారు అమ్మను కొలిస్తే వ్యాధులు నయమవుతాయని, అత్యం త మహిమాన్వితమైన ఈ అమ్మవారిని కొలిస్తే ఏలాంటి బాధలైన దూరమవుతాయని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి సిద్దిపేట ప ట్టణ పరిసర ప్రాంతాలనుండి కాకుం డా హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగ ర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుండి భక్తులు హాజరై తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. అత్యంత మ హిమ గలిగిన ఈ అమ్మవారి ఉత్సవా లు నేత్రపర్వంగా సాగుతాయి.
ఈనెల 21న గురువారం 6గంటల నుండి అమ్మవారి అభిషేకం, ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు గణపతి పూజ, స్వస్తివాచనము, రుత్విక్ గ్వరణము, ఆఖండ దీపారాధ న, కలశస్థాపన, గురు, గణపతి, మహారేణుక, ఏకవీర, మాతంగి, వనదుర్గ, మహాత్రిపురసుందరి, బ్రాహ్మాది సప్తమాతృకలు, వటుక బైరవ పరశురాముని మూల, మంత్రానుష్టాపనము లు, సాయంత్రం 5గంటల నుండి 8 గంటల వరకు మహారేణుక ఆవవరణ పూజ, సహాస్రనామర్చన, అషోత్తర శతనామపూజ, మహానివేదన, హరతి, తీర్థప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపా రు. 22నుండి 29 తేది వరకు ఉదయం 10 గంటల మధ్యాహ్నాం 1 గంట వర కు జపములు, పారాయణం, సాయ ంత్రం మహాపూజ, మహానివేదన, హా రతి, తీర్థప్రసాద వితరణ చేయనున్న ట్లు నిర్వాహకులు తెలిపారు. 29న శుక్రవారం మధ్యాహ్నాం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు విశ్వరూప ద ర్శనం, చండీహవనము, నవవరణ పూ జ, మహానివేదన పూర్ణహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30న శనివారం విజయదశమి రో జున అపరాజిత పూజ, శమీపూజ కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. దేవి నవరాత్రోత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారి కృ పకు పాత్రులు కాగలరని కోరారు.