మెదక్

పాపన్నపేటలో డిప్యూటీ స్పీకర్ సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, ఏప్రిల్ 11: డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాపన్నపేట మండలంలో విస్తృత పర్యటన చేసి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం రోజు మిషన్ కాకతీయ పనులను పాపన్నపేట మండలంలో ప్రారంభించారు. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామంలోని మల్లీ చెరువు పూడిక తీతకు 40.40 లక్షల రుపాయలు మంజూరు చేశారు. ఇదే గ్రామంలో గడ్డం చెరువుకు కూడా 39.50 లక్షలు మంజూరు చేశారు. గాంధారిపల్లిలో గిద్దకుంటకు 27.65 లక్షలు మంజూరు చేశారు. కొత్తపల్లి చెరువుకు 74.25 లక్షలు డిప్యూటి స్పీకర్ మంజూరు చేశారు. పొడ్చన్‌పల్లిలో 40 లక్షల ఖర్చుతో నిర్మించిన వ్యవసాయ ఉత్పత్తులను, నిలువలు చేసే గిడ్డంగులకు శంకుస్థాపన చేశారు. గాంధారిపల్లి గ్రామంలో కోటి 36 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన 33/11 కెవి సబ్‌స్టేషన్ ఆమె ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం రైతులకు వరం లాంటిదన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ పనులు చేపట్టడం జరిగిందన్నారు. చెరువుల నుండి పూడికతీత వలన చెరువులు, కుంటలలో నీటి నిలువల సామార్థ్యం పెరుగుతుందని, భూగర్భ జలాలు పెరిగి భూములలో విస్తారంగా పంటలు పండటం వలన రైతులకు లాభం చేకూరుతుందన్నారు. మెదక్ నియోజకవర్గంలో 36, 33/11 కెవి సబ్‌స్టేషన్‌లు పనిచేస్తున్నట్లు తెలిపారు. మరో మూడు నెలల్లో ఆరు 33/11 కెవి సబ్‌స్టేషన్‌ల పనులు పూర్తి అవుతాయన్నారు. మొత్తం మెదక్ డివిజన్‌లో 42 33/11 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ల ద్వారా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. 24 గంటల నిరంతర కరెంట్‌తో రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. 250 కోట్ల ఖర్చుతో 105 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఐదు నెలల్లో పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఇ సదాశివరెడ్డి, డిఈ శ్రీనివాస్, ఎడిఈ రవీందర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఇఇ ఎసయ్య, ఎంపిపి పవిత్ర దుర్గయ్య, జడ్పిటిసి స్వప్న బాలాగౌడ్, పార్టీ అధ్యక్షులు ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.