మెదక్

కిస్సా కుర్సీకా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 12: సిద్ద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పీఠానికి తీవ్ర పోటీ నెలకొంది. చైర్మన్ పదవి జనరల్‌లో కేటాయించారు. చైర్మన్ రేసులో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సుతో పాటు 10వార్డు నుంచి గెలుపొందిన మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఎన్నికల ముందు రాజనర్సుతో పాటు మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రావు సైతం పీఠాన్ని ఆశించారు. కాగా ఎన్నికల్లో 30వార్డు నుంచి అనూహ్య రీతిలో కాంగ్రెస్ అభ్యర్థి వజీరుద్దీన్ చేతిలో ఓటమి పాలైనారు. దీంతో చైర్మన్ రేసు నుంచి వెంకటేశ్వర్‌రావు తప్పుకున్నారు. ఎన్నికల్లో 16వార్డు నుంచి రాజనర్సు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వేణుగోపాల్‌రెడ్డి జనరల్ వార్డు 10వార్డుకు పోటీ చేసి 134 ఓట్లతో గెలుపొందారు. ప్రస్తుతం చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పని చేసిన రాజనర్సు మంత్రి హరీష్‌రావుకు నమ్మిన బంటుగా పేరుగాంచారు. వేణుగోపాల్‌రెడ్డి సైతం మంత్రి హరీష్‌కు ప్రియ శిష్యునిగా గుర్తింపు పొందారు. ఈనెల 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. మంత్రి హరీష్‌రావు ఇటీవల జరిగిన విలేకర్ల సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ నిర్ణయిస్తారని ప్రకటించారు. జనరల్ స్థానం కావడంతో భవిష్యత్‌లో మళ్లీ ఎప్పుడు వస్తుందోనని ఈ సారి చైర్మన్ పదవిని ఓసి వర్గానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డికి కేటాయించాలని పార్టీలోని కొందరు నేతలు మంత్రి హరీష్‌రావుమీద ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ముందుగా అనుకున్నట్టుగానే చైర్మన్ పదవిని అనుభవజ్ఞుడైన రాజనర్సుకు కేటాయించాలని పలువురు నేతలు మంత్రి పై ఒత్తిడి తెస్తున్నారు. చైర్మన్ పదవి కెసిఆర్ నిర్ణయిస్తుండడం వల్ల ఎవరికి కేటాయిస్తారని పార్టీలోని పలువురు నేతలు, రాజకీయ విశే్లషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి, వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల్లో వైస్ చైర్మన్ పదవిని మైనార్టీలకు కేటాయించారు. సిద్దిపేటలో సైతం మైనార్టీకే కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం 12వార్డు నుంచి అత్తర్‌పటేల్ రెండోసారి గెలుపొందగా, 20వార్డు నుంచి నసీరొద్దీన్ గెలుపొందాడు. వీరిద్దరు సైతం వైస్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. 30వార్డు నుంచి గెలుపొందిన వజీరొద్దీన్ సైతం టిఆర్‌ఎస్‌లోకి వస్తే వైస్ చైర్మన్ పదవి కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. సిద్దిపేట మున్సిపల్ బాద్‌షా ఎవరో, వైస్ చైర్మన్ ఎవరో ఎన్నికైన 16వరకు వేచి చూడాల్సి ఉంది.