మెదక్

ప్రాజెక్టుల నిర్మాణానికి టిడిపి వ్యతిరేకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, అక్టోబర్ 16: రైతు సంక్షేమంపై చిత్తశుద్దిలేని టిఆర్‌ఎస్ సర్కార్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నట్లు విమర్శిస్తుండడం సిగ్గుచేటని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు, సిద్దిపేట జిల్లా టిడిపి ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. సోమవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాదితులు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 500 రోజులుగా దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వ స్పందన లేకపోవడం దురదృష్టకరమని నిలదీశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్‌ట్రిబ్యునల్‌స్టే ఇవ్వడంతో ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడానికి ప్రయత్నిస్తోందని, న్యాయమైన పరిహారం చెల్లిస్తే రైతులే ముందుకు వచ్చే అవకాశం ఉండగా, అవేమీ పట్టించుకోకుండా సర్కార్ మొండి వైఖరితో ముందుకెల్తోందని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ప్రజాదనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టగా, కమిషన్‌ల కోసమే సర్కార్ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి జాప్యం చేసినట్లు విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న సిఎం కెసిఆర్ పేదలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా కొత్తకొత్త అంశాలను తెరపైకి తెస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయినందునే టిఆర్‌ఎస్ సర్కార్ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయింపజేస్తుండగా, ప్రజలను వివిద అంశాలపై చైతన్యం రాజకీయ జెయెసి చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం స్ఫూర్తి యాత్రలను పోలీసులచే అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తుండగా, టిఆర్‌ఎస్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఆర్కె శ్రీనివాస్, విరాసత్ అలి, మతీన్, చంద్రశేఖర్‌రెడ్డి, పరుచూరి రాజేశ్, నాగులు, హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇక ఇంటింటికీ కాంగ్రెస్
రామాయంపేట, అక్టోబర్ 16: ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తీసుకెళ్లి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిదర్‌రెడ్డి తెలిపారు. సోమవారం రామాయంపేటకు వచ్చిన సందర్బంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు అర్దరహితమని ఆయన అన్నారు. అనంతరం రామాయంపేట, నిజాంపేట మండలాల కిసాన్ మోర్చా అద్యక్షులకు నియామకం పత్రాలను అందించారు.
అక్కడి నుంచి మండలంలోని దామరచెర్వులో గడప గడపకు కాంగ్రేస్ పార్టీ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంబించారు. ఆయన వెంట స్థానిక కాంగ్రేస్ పార్టీ నాయకులు ఉన్నారు.

ప్రకృతి పర్యాటక కేంద్రంగా కోమటిచెరువు అభివృద్ధి
* అటవీ శాఖ సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి
సిద్దిపేట, అక్టోబర్ 16 : సిద్దిపేట కోమటిచెరువు రాష్ట్ర ఆటవి శాఖ సంస్ధ చైర్మగా బండ నరేందర్‌రెడ్డి సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట కోమటిచెరువు చాల అద్బుతంగా ఉందన్నారు. మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు కోమటిచెరువును సందర్శించినట్లు తెలిపారు. కోమటిచెరువును ప్రకృతి పర్యాటక కేంద్రంగా తీర్చదిద్దనున్నట్లు తెలిపారు. చెరువు మధ్యలో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఐలాండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ప్రకృతి పర్యాటక కేంద్రానికి అవసరమగు స్థలాన్ని పరిశీలించామని, వారం రోజుల్లో ప్లాన్‌లు సిద్ధం చేసి మంత్రి హరీష్‌రావుకు అప్పగిస్తామన్నారు. కోమటిచెరువు బాగా ఉందని, అద్భుతంగా తయారు చేశారన్నారు.
మా సంస్థ పక్షాన సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులకు మరింత ఆహ్వదాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఓఎస్‌డి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.