మెదక్

ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుపై సర్వే పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, అక్టోబర్ 20: ఘణపురం ఆనకట్ట పెంచేందుకుగాను ప్రభుత్వం వంద కోట్ల రుపాయలు మంజూరు చేసింది. ఈ కట్ట పెంచేందుకుగాను సర్వే కూడా పూర్తి అయిందని మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్ తెలిపారు. కట్ట ఎత్తు పెంచే విషయంలో మూడు గ్రామాల భూములు కొల్పోతున్న సర్వేను కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులో నాగ్సాన్‌పల్లిలో 87 ఎకరాలు, కొండపాకలో 42 ఎకరాలు, చిత్రియాల్‌లో కేవలం ఒక ఎకరం మాత్రమేనని ఆయన తెలిపారు. కాగా పాపన్నపేట మండలంలో ఘణపురం ఆనకట్ట పెంచేందుకు చేసిన సర్వే ప్రకారం 130 ఎకరాలు ఉంటుందని ఆయన తెలిపారు. జివో 120 ప్రకారం భూ పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో రైతులతో మండల స్థాయిలో సంప్రదింపులు జరిగాయని ఆర్డీఓ తెలిపారు. 2013 చట్టం ప్రకారం భూమి విలువ అంచనాల ప్రకారం చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులు చాలా సంతోషంతో ఘణపురం ఆనకట్ట పెంచేందుకు భూ బాధితులు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు.
భూ ప్రక్షాళన విజయవంతంగా కొనసాగుతోంది
మెదక్ డివిజన్‌లో 180 గ్రామాలు ఉన్నట్లు ఆర్డీఓ నగేష్ తెలిపారు. భూ ప్రక్షాళన సర్వే డిసెంబర్ 15 వరకు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 65 గ్రామాల్లో భూ ప్రక్షాళన సర్వే పూర్తి అయినట్లు తెలిపారు.

రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాలి
* నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
వెల్దుర్తి, అక్టోబర్ 20: మండల కేంద్రమైన వెల్దుర్తిలో డబుల్‌రొడు నిర్మాణ కోసం తలపెట్టిన రొడు వెడల్పులో ఇల్లు కోల్పోతున్న వారితో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడారు. శుక్రవారం మండలంలోని నెల్లూరు, వెల్దుర్తి గ్రామపంచాయితీలో ఇల్లు కోల్పోతున్న బాధితులు అందరికి అండగా ఉండి వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లును కట్టిస్తామని అందుకు లబ్ధ్థిరులు అందరూ సహకరించాలని ఆయన వారితో మాట్లాడారు. అందుకు లబ్ధ్ధిరులు ఇప్పటికిప్పడే ఇల్లు కూల్చెస్తే మాకు ఇల్లు కిరాయికి దొరికే పరిస్థితులు లేవని మాకొంత సమయం కావాలని వారు తెలిపారు.