మెదక్

మెదక్ చర్చిలో ఘనంగా కోతకాలపు పండుగ ఆరాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, అక్టోబర్ 22: వంద సంవత్సరాల క్రితం ఆకలి రోజులు ఎదుర్కొన్న ప్రజలకు 10 సంవత్సరాల పాటు పనికి ఆహార పథకం క్రింద మెదక్ చర్చి నిర్మించబడిందని బిషప్ రైట్ రెవ. డాక్టర్ సాల్మాన్‌రాజ్ గుర్తు చేశారు. ఆదివారం కోతకాలపు పండుగ ఆరాధన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మహా దేవాలయంతో పాటు విద్యా వైద్య సంస్థలకు అప్పటి నిర్మాణకర్తలు ప్రాధాన్యతనిచ్చారని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కోతకాల పండుగను మహా వైభవంగా ఆలయాల్లో జరుపుకోవడం శుభసూచకంగా ఉంటుందని బిషప్ తెలిపారు. ఎంతో అందంగా భూమిపై పండిన ప్రతి పంటతో పాటు పుష్పాలు, అరటి తోరణాలు, వివిధ రకాల పండ్లతో చర్చిని అందంగా అలంకరించారు. అన్ని ధాన్యాలు కూడా చర్చి ప్రాంగణంలో అలంకరణ చేశారని వారందరిని బిషప్ అభినందించారు. జీవితంలో మార్పు రావాలని ఆయన కోరారు. యదార్దమైన హృదయంతో దేవుని వద్దకు రండని బిషప్ రైట్ రెవ. డాక్టర్ సాల్మాన్‌రాజ్ పిలుపునిచ్చారు. దేవుడిని మోసం చేయకండి, ఇది చాలా పాపమైన విషయమని ఆయన పేర్కొన్నారు. త్యాగపూరితమైన నిత్య జీవంతో ఉండాలన్నారు. మెదక్ సిఎస్‌ఐ పరిధిలో విద్య, వైద్యం పరిచయాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా దీనమైన వృద్దులు ఉన్నారన్నారు. గతంలో విద్యాపరంగా నడుస్తున్న సంస్థలకు జర్మనీ నిధులు వచ్చేవని, అవి చాలా కాలంగా రద్దు పరిచినట్లు తెలిపారు. సిఎస్‌ఐ సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులందరు నిరుపేద కుటుంభాలకు చెందిన వారన్నారు. అలాంటి పిల్లలందరికి సిఎస్‌ఐ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కానుకలతో నడుస్తున్నాయని ఆయన తెలిపారు. అంతే కాకుండా వృద్దులను కూడా సంస్థ నడుపుతున్నట్లు తెలిపారు. గురువుల సతీమణులు రోజుకో రుపాయ వంతున జమచేసి ఏడాది నిధులను వృద్దాశ్రమాలకు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇది నిరంతరం దేవుని ఆశీర్వాదంతో సంస్థలు నడపబడుతున్నాయని ఆయన తెలిపారు. మీ హృదయంలో దేవుడిని ఏర్పాటు చేసుకోవాలని భక్తులకు ఆయన పిలుపునిచ్చారు. కోత కాలపు పండుగలో రైతులతో పాటు నిరుపేద ప్రజలు జీవించే కాలం ఇదని ఆయన తెలిపారు. సిఎస్‌ఐ సంస్థలో 107 పాస్నేట్‌లు ఉన్నాయని, వంద ఇవాంజలిస్ట్‌లు ఉన్నాయని, అధ్యక్ష మండలంలో మూడు వేల మంది స్ర్తిల సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఒక్కో పాస్నేట్ నుండి 10 మంద వంతున మొత్తం మూడు వేల మంది ఈ నెల 30,31న స్ర్తిల మైత్రి సంఘం ప్రత్యేక సమావేశం ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 27,28న గురువులు, ఇవాంజలిస్ట్‌లకు శిక్షణ ఉంటుందన్నారు. 35 సంవత్సరాలు దాటిన స్ర్తిలకు ప్రత్యేక ప్రార్దనలు ఉంటాయన్నారు. బిషప్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ప్రిసిబిటరి ఇంచార్జీ రెవ.ర్యాబిన్‌సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవ.సుశీల్, రెవ.జాషువా, రెవ.రాజ్‌కిరణ్, ఇవాంజలిస్ట్‌లు డేవిడ్, నాగరాజు, బిషప్ కమీషన్ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటు అనేక ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.