మెదక్

ఏడుపాయలకు కార్తీక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని మాత పుణ్యక్షేత్రం ఆదివారం రోజు వేలాది భక్తులతో సందడిగా మారింది. డప్పుచప్పుల్లు, భారీ ఉరేగింపుల మధ్య భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఆదివారం రోజు వనదుర్గామాత ప్రత్యేక అలంకారంతో భక్త జనావళికి దర్శనమిచ్చింది. పవిత్ర మంజీర నదీపాయల్లో, షవర్ బాత్‌లు భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు.
ఆదివారం ఉదయం వనదుర్గామాత ఆలయంలో అమ్మవారికి అలయ అర్చకులు అభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేక విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. దుర్గామాత అమ్మవారిని ఆలయ గర్భాలయంలో అలయ అర్చకులు పట్టు వస్త్రాలతో, రంగురంగుల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయ చైర్మన్ పి.విష్ణువర్దన్‌రెడ్డి, ఆలయ ఈఓ టి.వెంకటకిషన్‌రావులు దుర్గామాత అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు వినూత్న శోభతో భక్తజనావళికి దర్శనమిచ్చారు. మహిళా భక్తులు గండదీపం, బోనం మూస్తూ లయబద్దంగా నృత్యాలు చేస్తూ అమ్మవారి ఆలయానికి తరలి వచ్చారు. భక్తులు బోనాలు, కొబ్బరికాయలు, తలనీలాలు, అమ్మవారికి చీరలను, గాజులను సమర్పించి, సంతాన గుండంలో దంపతులు పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో కొబ్బరికాయలు, తొట్టెళ్లను కట్టారు.