మెదక్

వేడెక్కిన ఖేడ్ రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ అక్టోబర్ 22: నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం, భూపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ బి, హన్మంతు మధ్య రచ్చకెక్కి విభేదాలను తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్టల్ర ప్రజలకు నాయకులకు యువకులకు రైతులకు తెలిసి పోయింది. నిజమే. ఇద్దరూ అవినీతి పరులే.. భూ కుంభ కోణాలతో హన్మంతు ముందుకు పోతుంటే పర్సెంటేజీలతో భూపాల్‌రెడ్డి ముందుకు సాగుతునట్లు కాంగ్రెస్ నాయకులు అరోపణలు చేసిన సంగతి విధితమే. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ రాకుండా అడ్డుకునేందుకు కొందరు టిఆర్‌ఎస్ పార్టీలోని అసమ్మతి నాయకుల గ్రూపు హన్మంతు ద్వారా భూపాల్‌రెడ్డిపై అరోపణలు చేయించారని జరుగుతున్న ప్రచారానికి హన్మంతు మళ్ల్లీ విలేకరులతో మాట్లాడుతూ తొందర పాటుతో ఎమ్మెల్యేపై నోరుజారానని సవరణ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. గతంలో నుంచి టిఆర్‌ఎస్ పార్టీలో కలుపుకునేందుకు మాృజీ శాసన సభ్యుడు ఎం,విజయపాల్‌రెడ్డికి టిఆర్‌ఎస్ నాయకులు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయినా అయన టిడిపి తరుపున ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ వస్తున్నారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో టిడిపి, టిఅర్‌ఎస్ పార్టీలు పొత్తు కుదుర్చుకుని వచ్చే 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీల నాయకులు చర్చలు చేస్తునట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో మాజీ శాసన సభ్యుడు విజయపాల్‌రెడ్డికే నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా టిఆర్‌ఎస్ పార్టీ తరుపున టిక్కెట్ ఇచ్చే అవకాశలు లేక పోలేదని కొందరు రాజకీయ విశే్లషకులు చర్చించుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఉప్ప ఎన్నికల్లో టిడిపి నుంచి 30వేలకు పైగా కార్యకర్తలు ఓటర్లు టిఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేయడంతో టిఆర్‌ఎస్ పార్టీ గెలుపునకు సునాయాసంగా అయిందని చెప్పవచ్చును. టిడిపి మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి నిజాయితీగా పేరు సంపదించుకున్నారు. ఏదైనా పని చేసినా డబ్బులు తీసుకుని చేయడం వంటి పద్ధతులు అయనకు మొదటి నుంచే అలవాటు లేదని అయన అభిమానులు కార్యకర్తలు చెబుతుంటారు. మాట ఇస్తే ఎంత కష్టమైనా సరే పని చేసి తీరుతారనే పేరు విజయపాల్‌రెడ్డికి ప్రజల్లో నాటుకు పోయి ఉంది. టిడిపి, రైలు గుర్తులపై పోటీ చేసినా 45 వేలు ఓమారు. మరో మారు 42వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. సురేష్‌శెట్కార్‌తో పోటీ చేయగా 55వేల 450 ఓట్లు రాగా సురేష్‌శెట్కార్‌కు 59వేల పైచిలుకు ఓట్లు రాగా 4,500 ఓట్లు మెజార్టీతో సురేష్‌శెట్కార్ గెలుపొందారు. ఈ క్రమంలో ఓటమి పాలైన ఓటు బ్యాంకు విజయపాల్‌రెడ్డికి మంచి పట్టుతో ఉన్నదని చెప్పక తప్పదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పనికి రాదని ఆంధ్రపార్టీ పేరుతో మాకు ఏమి అవసరమని టిఅర్‌ఎస్ నాయకులు ప్రచారం చేయడంతో ఓటర్లు ఉప ఎన్నికల్లో ఎదురు తిరిగి టిఆర్‌ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న స్వయాన వారి సోదరులైన భూపాల్‌రెడ్డికి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు చరిత్రకు తెరదించారు. మచ్చ లేని నాయకుడుగా పేరున్నా టిడిపి నుంచి పోటీ చేయడంతో ఓటమి పాలవుతునట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికైన మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి రాజకీయ మార్పులు తెచ్చుకుంటారని అశిస్తునట్లు పలువురు గ్రామ సర్పంచులు టిడిపి నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపు రాజకీయలు కొనసాగుతున్న నేధ్యంలో భూపాల్‌రెడ్డిపై అదే పార్టీలో పెరిగిన అసమ్మతి రాజకీయలతో నియోజక వర్గంలో మంచి నాయకునికి ఎంచుకుని వచ్చే ఎన్నికల్లో విజయపాల్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చే అలోచనలో టిఆర్‌ఎస్ పార్టీ అధీష్టానం ఉన్నట్లు సమాచారం.