మెదక్

సిద్దిపేట నుంచి టిడిపిని ఎవరూ వీడరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 22 : తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జాతీయ అధ్యక్షుడు, పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, సిద్దిపేట నియోజక వర్గం ఇంచార్జీ గుండు భూపేశ్ అన్నారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఇతర పార్టీలకు వలస పోతున్నారని మీడియాల్లో కథనాలు వస్తున్నాయని, విస్తృతంగా ప్రచారం జరుగుతోందని అదంత వచ్చి ప్రచారమే అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, రాష్ట్ర నేతలు తాము చేరుతున్నట్లుగాని, ఇతర పార్టీ నేతలు చేర్చుకున్నట్లుగా ఎక్కడ స్పష్టంగా పేర్కొన లేదన్నారు. మీడియాల్లో వస్తున్న కథనాలు ఊహగానాలే అని పలువురు ముఖ్య నేతలు ఖండించినట్లు పేర్కొన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పోలిట్‌బ్యూరో నిర్ణయాన్ని, అధినేత చంద్రబాబు ఆదేశాలను పాటిస్తారన్నారు. పార్టీకి సుశిక్షుతులైన నాయకత్వం, కార్యకర్తలున్నారన్నారు. సిద్దిపేట నియోజక వర్గానికి చెందినే నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. ఈనెల 26 టిడిపి పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన ముఖ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గం ఇంచార్జీలు, ముఖ్య నేతలకు ఆహ్వానించినట్లు తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈసమావేశానికి హజరై పార్టీ పరిస్థితి, అన్ని విషయాలపై చర్చిస్తారన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు మీడియాలో వస్తున్న కథనాలకు, పార్టీ నేతల వలసల విస్తృత ప్రచార ఊహగానాలకు తెరదింపుతారన్నారు. ఎలాంటి అపోహాలూ నమ్మవద్దని స్పష్టం చేశారు. నియోజక వర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.
ఈకార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు గుడిమల సత్తయ్య, బాసంగారి వెంకట్, రాజేశం యాదవ్, కిషన్, గోవిందారం చంద్రం, సత్యనారాయణరెడ్డి, సాదత్‌అలీ, నఫీజ్ తదితరులు పాల్గొన్నారు.