మెదక్

యోగ ఏకగ్రతకు అవసరమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 22 : యోగ ఏకగ్రతకు ఏంతో అవసరమని మంత్రి హరీష్‌రావుఅన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి యోగ పోటీల్లో మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. చదువుతో పాటు వ్యాయామం అవసరమని, గెలుపు ఓటమిలు సహజమన్నారు. విద్యార్థులకు చదువు, సంపదతో పాటు వ్యాయామం అవసరమన్నారు. పిల్లలకు తల్లిదండ్రులకు వ్యాయామం నేర్పించాలన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో యోగను విద్యార్థులకు తప్పనిసరిగా నేర్పించాలన్నారు. క్రీడ రంగాన్ని మరింత అభివృద్ధిని చేస్తామన్నారు. 5కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్వీమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 64 లక్షలతో మినిస్టేడియంలో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయి యోగ పోటీలు సిద్దిపేటలో నిర్వహించేలా కృషిచేస్తామన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి మినిస్టేడియాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో సిద్దిపేటను క్రీడ హబ్‌గా తీర్చిదిద్దుతానన్నారు.
రాష్ట్ర స్థాయి యోగ పోటీల్లో విజేత ఉమ్మడి మెదక్ జిల్లా
సిద్దిపేటలో రెండు రోజుల పాటు ఎసిజిఫ్ ఆధ్వర్యంలో వడ్డెపల్లి దయానంద్ గార్డెన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ద్వితీయ స్థానం ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ తృతీయ స్థానం గెలుచుకున్నారు. విజేతలకు మంత్రి హరీష్‌రావుబహుమతులు అందచేశారు. అండర్ -14, అండర్ 17 విభాగాల్లో బాల, బాలికలకు యోగ పోటీలు నిర్వహించారు. ఈ యోగ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుండి 280 క్రీడకారులు పాల్గొన్నారు.