మెదక్

బిజెపి, టిఆర్‌ఎస్ కార్యకర్తల వాగ్వాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంగునూరు, అక్టోబర్ 22: కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ పంచాయతీకి నేరుగా అందిస్తున్నా చెప్పడం లేదని జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి మాట్లాడుతున్న సమయంలో సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి మరికొంత మంది టిఆర్‌ఎస్ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగారు. ఆదివారం నంగునూర్ మండల పరిధిలోని మగ్దుంపూర్ గ్రామంలో బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడకముందు జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్రానికి వస్తున్నాయని, వీటితో పాటు గ్రామ పంచాయతీలకూ నిధులు నేరుగా వస్త్తూ అభివృద్ధి జరుగుతున్నట్లు చెప్పడంతో సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి జోక్యం చేసుకొని మీపార్టీ గురించి చెప్పుకొని వెళ్లిపోవాలే తప్ప గ్రామ పంచాయతీ గురించి ఇక్కడ మాట్లాడకండి అనడంతో టిఆర్‌ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను సముదాయించిన వినకుండా పెద్ద ఎత్తున ఎవరి పార్టీకి అనుకూలంగా వారు నినాదాలు చేశారు. మధ్యలో నాగం జనార్ధన్‌రెడ్డి జోక్యం చేసుకొని అన్ని అనుమతులతోనే ఈ సమావేశాన్ని జరుపుతున్నామని పొలీసులు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరికీ సమావేశంలో జరుపుకొని మాట్లాడే స్వేచ్ఛ ఉందని, దీనిని విస్మరించి టిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం సరికాదన్నారు. బిజెపి కార్యకర్తలు ఒర్పుతో ఉండాలని సూచించారు. ఎస్‌ఐ శ్రీనివాస్ సైతం ఇరువర్గాలను శాంతింపజేశారు. తర్వాత బిజెపి సమావేశం కొనసాగింది.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

* మంత్రి సమక్షంలో బిజెపి కార్యకర్తల చేరిక
సిద్దిపేట రూరల్, అక్టోబర్ 22: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకులే కీలక పాత్ర పోషించాలని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన 30 మంది బిజెపి యువతకు మంత్రి హరీష్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. నిరుద్యోగ యువతీ, యువకుల కోసం భారీగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. సిద్దిపేటలో నిరుద్యోగులకు పోటీ పరీక్షల కొరకు ఉచితంగా శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలను యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నానని, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా సిద్దిపేట మారిందన్నారు. తెరాస పార్టీ యువతను అన్ని విధాలుగా కాపాడుకుంటానన్నారు. టిఆర్‌ఎస్ చేరిన వారిలో ఎబివిపి, బిజెవైఎం నేతలు రేణిగుంట నగేష్, పంది నగేష్, శ్రావణ్, రంజిత్, సంపంగి శ్రీకాంత్ తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌రావు, జెడ్పిటిసి వజ్రవ్వయాదగిరి, మారెడ్డి రవీందర్‌రెడ్డి, కొటగిరి శ్రీహరిగౌడ్, వంగ ప్రవీణ్‌రెడ్డి, శేషు తదితరులు పాల్గోన్నారు.

రాష్ట్రంలో అవినీతి పాలన: నాగం

నంగునూరు/ చిన్నకోడూరు అక్టోబర్ 22: రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని ఇలాంటి పాలన నేనెప్పుడు చూడలేదని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపించాడు. ఆదివారం నాడు నంగునూరు మండల పరిధిలోని మగ్దుంపూర్, చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామంలో పలువురు టిఆర్‌ఎస్ కార్యకర్తలు నాగం జనార్థన్‌రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలనాటి రజాకార్లను తలపించేవిధంగా రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పాలనలో సామాన్య ప్రజలు భయాందోళనకు గురిఅవుతున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందివ్వకుండా కేవలం టిఆర్‌ఎస్ కార్యకర్తలకే అందించి అన్యాయం చేస్తున్నారన్నారు. రైతు రుణమాపి, డబుల్ రూం, దళితులకు మూడేకరాల భూమి తదితర హామీల అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని అరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు. అంతకుముందు నాగం జనార్థన్‌రెడ్డికి గ్రామస్తులు ఘనంగా స్వాగంతం పలికారు. గ్రామ వీదుల్లో ర్యాలీ తీసిన అనంతరం పార్టీ జండాను అవిష్కరించారు. ఇటివల కురిసిన వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి కన్నీళ్లు తుడిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దేశానికి సుస్థిరత పాలన అందించే లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి, నేతలు బాలేశ్, శశిధర్‌రెడ్డి, తిరుపతిరావు, యాదమల్లు, రజినీకర్‌రెడ్డి, కొంరయ్య, తిరుపతిరెడ్డి, పర్షరాములు, సత్యనారాయణరెడ్డి, వెంకట్‌రెడ్డి, పార్థీవరెడ్డి, వేణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరానికి కాంగ్రెస్ అడ్డు!
* ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సాగు నీరందిస్తాం * ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి
రామాయంపేట, అక్టోబర్ 22: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతోందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు సాగు నీరు అందిస్తామని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో ఆదివారం ఆమె పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 10లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా కమ్యూనిటీ భవనాన్ని ప్రారంబించి, ఎస్‌సి కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ అహర్నిశలూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో 24గంటల విద్యుత్, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పించన్ ఇచ్చిన ఘనతా తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. నిరుపేద అమ్మాయిల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాల ద్వారా 75వేల నగదును అందిస్తున్నామన్నారు. నేటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగిందన్నారు. ఇందుకు కారణం కేసిఆర్ కిట్టే అన్నారు. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం ప్రతి రైతు ఖాతాలో పెట్టుబడి కోసం ఎకరాకు 4వేల రూపాయలు జమచేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని కులసంఘాలను ఆర్థిక పరిపుష్టత కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. మిషన్ భగీరత ద్వారా వచ్చే 2018 డిసెంబర్ నాటికి ఇంటింటికి తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత నందిగామ గ్రామస్థులకు ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం యాదవ సంఘం అద్వర్యంలో గొర్రె పిల్లను ఉపసభాపతికి బహుకరించారు. ఈకార్యక్రమంలో ఎంపిపి పుట్టి విజయలక్ష్మీ యాదగిరి, జెడ్పీటిసి బిజ్జ విజయలక్ష్మీ సంపత్, వైస్ ఎంపిపి పల్లె జితెందర్‌గౌడ్, మార్కెట్ కమిటి వైస్ చైర్మెన్ అందె కొండల్‌రెడ్డి, మాజీ జెడ్పీటిసి సరాఫు యాదగిరి, సర్పంచులు సంగు స్వామి, పాతూరి ప్రభావతి, ఎంపిటిసిలు బిజ్జ లక్ష్మీదాసు, గడ్డి శ్యాంసుందర్, సొసైటీ చైర్మెన్లు దేశెట్టి లింగం, కిష్టారెడ్డి, నిజాంపేట మండల పార్టీ అద్యక్షులు సుదాకర్‌రెడ్డి, తహశీల్దార్ ఆనందరావు, తెరాస నాయకులు పుట్టి యాదగిరి, నాగేశ్వర్‌రెడ్డి, బాజ చంద్రం, పోచమ్మల ఐలయ్య, భాస్కర్‌రావు, సార్గు సత్యనారాయణ, బన్సీలాల్, దేమె యాదగిరి, బాసం శ్రీనివాస్, దేవుని రవి, పోచమ్మల స్వామి, దేవుని రాజు, తోట లక్ష్మీపతి, నవాత్ నగేష్, సరాఫు శ్యాం, యాద నాగరాజు, పూలపల్లి యాదగిరి యాదవ్, నగేష్‌యాదవ్, శ్రీనివాస్, అబ్దుల్ అజీజ్, పున్న వెంకటస్వామి, ఆకుల బాలయ్య, బుచ్చ నర్సింలు, దుబ్బరాజాగౌడ్, గోపరి నర్సింలు, కొమ్మాట సత్యనారాయణ, రంజిత్, మైసాగౌడ్, నాయిని యాదగిరితో పాటు తదితరులు ఉన్నారు.