మెదక్

కరవు నివారణలో వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 12: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నప్పటికి నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కరవుబారిన పడిన జిల్లా ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిధిగా హాజరైన తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకునే స్థితిలో ప్రభుత్వం లేదని, వర్షాభావ పరిస్థితులతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువును దృష్టిలో ఉంచుకొని అన్ని గ్రామాల్లో తాగునీరు, పశుగ్రాసం, రేషన్ సరుకులను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించి చట్ట ప్రకారం 194రూపాయల కూలీ డబ్బులను చెల్లించాల్సి ఉన్నప్పటికి 30నుండి 40రూపాయలు మాత్రమే చెల్లించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఉపాధి హామి చట్టం ఎవరి దయా దక్షణ్యాలతో రాలేదని, ఎర్రజెండ చేసిన ఉద్యమం ద్వారా వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతుందన్నారు. ఉపాధి హామి కింద బడ్జెట్‌లో 36వేల కోట్లను కేటాయిస్తే విడుదల చేసింది మాత్రం కేవలం 3వేల కోట్లు మాత్రమేనని విమర్శించారు. కేంద్రంతో కెసిఆర్ కుమ్మక్కై పేదల కడుపుకొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి ఓటు వేసిన ప్రజలను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు కొద్దిపాటి నిధులు కేటాయించి పూర్తి చేయడం లేదు కాని, వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాదు బతుకు తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. లక్షా 35వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో కరువు నివారణకు ఎన్ని కోట్లు కేటాయించారని ప్రశ్నించారు. మీ సొంత డబ్బులు ఇవ్వమని ఆడగడం లేదని, ప్రజాసొమ్మును ప్రజలకే ఇవ్వమంటున్నామని, తక్షణమే జిల్లాకు 400కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం, కార్యదర్శివర్గసభ్యులు జి.జయరాజ్, బీరం మల్లేశం, మాణిక్యం, రాజయ్య, జిల్లా కమిటి సభ్యులు అడివయ్య, ప్రవీన్, యాదవరెడ్డిలతో పాటు వివిధ గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.