మెదక్

సిద్దిపేట మున్సిపల్ చైర్మన్‌గా రాజనర్సు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 14: సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈనెల 16న నిర్వహిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల అధికారిగా జడ్పి సిఇఓ వర్షిణి వ్యవహరించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 34స్థానాలకు 22స్థానాలను గెలుచుకుంది. రెబెల్స్‌గా గెలుపొందిన 7గురు అభ్యర్థులు సైతం టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో టిఆర్‌ఎస్ బలం 29కి చేరింది. కాంగ్రెస్ 2, బిజెపి 2, ఎంఐఎం 1స్థానాలు గెలిచారు. 30వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ వజీరుద్దీన్ టిఆర్‌ఎస్‌లోచేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. వజీరుద్దీన్ చేరితే టిఆర్‌ఎస్ బలం 30కి చేరుకుంటుంది. టిఆర్‌ఎస్‌లో చైర్మన్ పదవి కోసం రాజనర్సు, 10వార్డు నుంచి గెలుపొందిన వేణుగోపాల్‌రెడ్డి పోటీ పడుతున్నారు. మంత్రి హరీష్‌రావుకు నమ్మిన బంటుగా ఉన్న రాజనర్సుకే మరోసారి చైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాగా చైర్మన్ జనరల్‌కుకేటాయించడం వల్ల ఈ సారి తమకు ఇవ్వాలని వేణుగోపాల్‌రెడ్డి, ఓ వర్గం మంత్రి హరీష్ పై ఒత్తిడి తెస్తున్నారు. వేణుగోపాల్‌రెడ్డి సైతం హరీష్‌కు ప్రియశిష్యునిగా గుర్తింపు పొందారు. మంత్రి హరీష్‌రావు శుక్రవారం సిద్దిపేటలో నూతనంగా గెలిచిన టిఆర్‌ఎస్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. సమావేశంలో టిఆర్‌ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఖరారు చేయనున్నట్లు తెలిసింది. చైర్మన్‌గా రాజనర్సుకే అధిక అవకాశాలు ఉన్నాయి. వైస్ చైర్మన్ పదవిని మైనార్టీలకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో చైర్మన్ కోసం పోటీ పడ్డ వేణుగోపాల్‌రెడ్డికి వైస్ చైర్మన్ పదవి సైతం కట్టపెడుతారనే ఊహాగానాలు సైతం గట్టిగా వినిపిస్తున్నాయి. శుక్రవారం మంత్రి సమక్షంలోనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరో పార్టీపరంగా ఎంపిక చేయనున్నారు. 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అధికారికంగా నిర్వహించనున్నారు.